Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Duvvada Srinivas: ధర్మాన కృష్ణదాస్ తన హత్యకు కృట్ర చేస్తున్నారని ఆరోపించారు దువ్వాడ శ్రీనివాస్. దీంతో శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Duvvada Srinivas: శ్రీకాకుళం రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దువ్వాడ శ్రీనివాస్, కృష్ణదాస్ మధ్య జరుగుతున్న వార్ మరోసా స్థాయికి చేరింది. ఇన్ని రోజులు మాటలకే పరిమితమైన రాజకీయం ఇప్పుడు హత్యలు, దాడుల వరకు వెళ్లేలా ఉందని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అర్థరాత్రి వేళ హైవే పైకి వచ్చి హడావుడి చేశారు. కృష్ణదాస్ చంపేందుకు స్కెచ్ వేస్తున్నారని తానే వచ్చానంటూ సవాల్ చేశారు. దీనిపై అదే స్థాయిలో స్పందించారు మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్.
వైసీపీలో ఉన్నప్పటి నుంచి కృష్ణదాస్ దువ్వాడ శ్రీనివాస్ మధ్య వార్ నడుస్తూ వచ్చింది. తర్వాత దువ్వాయ ఫ్యామిలీ ఇష్యూ అనంతర పరిణామాలతో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినా వీళ్ల మధ్య నడుస్తున్న వార్‌కు ఫుల్‌స్టాప్ పడలేదు. ఇప్పుడు ఇది మరో స్థాయికి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. శుక్రవారం రాత్రి దివ్వెల మాధురికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. కృష్ణదాస్ వద్ద ఉండే అప్పన్న అనే వ్యక్తి ఫోన్ చేశాడు. దువ్వాడ శ్రీనివాస్ హత్యకు కుట్ర జరుగుతుందని చెప్పాడు. ఈ ఫోన్ గురించి తెలుసుకున్న వెంటనే దువ్వాడ శ్రీనివాస్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన హత్యకు కుట్ర చేయడం ఏంటని, హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే నడి రోడ్డుపైకి వచ్చానని దమ్ముంటే హత్య చేయాలంటూ సవాల్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.
ధర్మాన కుటుంబం తనపై కక్షకట్టిందని ఆరోపిస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పిటికే పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. తనను పూర్తిగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్పుడు మరింత స్వేచ్ఛగా పోరాటం చేస్తామని అన్నారు. జిల్లాలో ఓ వర్గాన్ని తొక్కేస్తున్న ధర్మాన సోదరులపై పోరాటానికి తనకు మరింత ఫ్రీడం లభిస్తుందని చెప్పుకొచ్చారు.
దువ్వాడ శ్రీనివాస్ తనపై చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. అసలు దువ్వాడపై తనకు ఎందుకు కక్ష ఉంటుందని ప్రశ్నించారు. ఆయన తనను అనవసరంగా విమర్శిస్తూ నవ్వులపాలవుతున్నారని అన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్నందునే తమ అనుచరులు స్పందిస్తున్నారని చెప్పుకొచ్చారు. కింజారపు అప్పన్నతో తాను మాట్లాడింది నిజమని చెప్పుకొచ్చారు. అయితే దువ్వాడ శ్రీనివాస్‌పై మాత్రం ఎలాంటి కోపం లేదని వివరించారు.
ఇప్పుడే కాదు సమయం చిక్కినప్పుడల్లా ధర్మాన సోదరులపై దువ్వాడ శ్రీనివాస్ విమర్శలు చేస్తూ వస్తున్నారు. జిల్లాల్లో కింజరాపు, ధర్మాన సోదరులు కళింగ కులస్తులను తొక్కిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపిస్తూ వచ్చారు. తన జాతి కోసం ఎంత వరకైనా పోరాటం సాగిస్తానంటూ చాలా సార్లు ప్రకటించారు. ఈ క్రమంలో తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదని అన్నారు. ప్రజల్లోకి వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తానంటూ ఇప్పటికే చెప్పారు. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తనపై లేనిపోనివి చెప్పి జగన్‌కు దూరం చేసే కుట్ర చేశారని, తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసే వారి బాగోతం కూడా బయటపెడతానంటూ శపథం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















