అన్వేషించండి

Farmers Protest: నవంబర్ 29న రైతుల 'చలో పార్లమెంట్'.. మోదీ సర్కార్‌కు తప్పని నిరసన సెగ

నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకునే ప్రక్రియ పార్లమెంటులో పూర్తయ్యే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని రైతులు ప్రకటించారు.

కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తామని మోదీ సర్కార్ ప్రకటించినప్పటికీ రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై సింఘు సరిహద్దులో చర్చించిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎమ్) తమ తదుపరి కార్యాచరణను వెల్లడించింది. నవంబర్ 29న పార్లమెంటు వరకు కవాతు చేయనున్నట్లు ప్రకటించింది. 

సాగు చట్టాలను రద్దు చేస్తున్నప్పటికీ ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకు తమ కార్యాచరణను యథావిధిగా కొనసాగిస్తామని ఎస్‌కేఎమ్ ప్రకటించింది.

కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై చట్టం రూపకల్పన, లఖింపుర్ ఘటనపై కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా బర్తరఫ్, అరెస్ట్ సహా మొత్తం ఆరు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు రైతులు. 

కార్యాచరణ..

1) ఇప్పటికే ప్రకటించిన అన్ని కార్యక్రమాలను చేపట్టనుంది ఎస్‌కేఎమ్. నవంబర్ 27న మరోసారి రైతుల భేటీ జరగనుంది.  

2) లఖ్‌నవూలో నేడు జరగనున్న కిసాన్ మహాపంచాయత్‌లో పాల్గొనాలని పౌరులకు రైతులు పిలుపునిచ్చారు. 

3) నవంబర్ 24న చోటు రామ్ పుట్టినరోజును కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ దివస్‌గా ఎస్‌కేఎమ్ ప్రకటించింది. 

4) నవంబర్ 26న 'దిల్లీ బోర్డర్ మోర్చే పే చలో' అనే కార్యక్రమాన్ని జరపనుంది. 

5) నవంబర్ 27న జరగనున్న భేటీలో తదుపరి కార్యాచరణను ప్రకటించనుంది ఎస్‌కేఎమ్.

నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకునేలా పట్టువదలకుండా రైతులు చేసిన పోరాటంపై ఎస్‌కేఎమ్ హర్షం వ్యక్తం చేసింది. ఇది చారిత్రక విజయంగా అభివర్ణించింది.

నవంబర్ 24న మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకునే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం పలికే అవకాశం ఉంది. 

నవంబర్ 29 నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశంలో మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకునే బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

Also Read: Abhinandan Awarded Vir Chakra: పాక్‌ను వణికించిన కమాండర్ అభినందన్‌కు 'వీర చక్ర'

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
Harish Rao on Fire: నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
Yellamma : 'ఎల్లమ్మ'కు సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా ? - నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మరో క్రేజీ హీరోయిన్ ఎవరంటే ?
'ఎల్లమ్మ'కు సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా ? - నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మరో క్రేజీ హీరోయిన్ ఎవరంటే ?
IPL 2025 KKR VS RCB Match Abondoned: ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కు ర‌ద్దు ముప్పు..! ఆ కారాణాలతో జ‌రిగే అవ‌కాశాలు లేవు..!! ఆందోళ‌న‌లో కేకేఆర్, ఆర్సీబీ
ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కు ర‌ద్దు ముప్పు..! ఆ కారాణాలతో జ‌రిగే అవ‌కాశాలు లేవు..!! ఆందోళ‌న‌లో కేకేఆర్, ఆర్సీబీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth | సునీత సాహసంపై Cousin Dinesh Rawal మాటల్లో | ABP DesamSSMB29 Location | ఒడిశా అడవుల్లో జక్కన్న | ABP DesamBRS MLAs Supreme Court Affidavit | వేటు పడకుండా..10మంది BRS ఎమ్మెల్యేల రహస్య వ్యూహం..! | ABPNara Lokesh Holds Jr NTR Flexi | లోకేశ్ చర్యల వెనుక రీజన్ ఇదేనా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
Harish Rao on Fire: నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
Yellamma : 'ఎల్లమ్మ'కు సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా ? - నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మరో క్రేజీ హీరోయిన్ ఎవరంటే ?
'ఎల్లమ్మ'కు సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా ? - నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మరో క్రేజీ హీరోయిన్ ఎవరంటే ?
IPL 2025 KKR VS RCB Match Abondoned: ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కు ర‌ద్దు ముప్పు..! ఆ కారాణాలతో జ‌రిగే అవ‌కాశాలు లేవు..!! ఆందోళ‌న‌లో కేకేఆర్, ఆర్సీబీ
ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కు ర‌ద్దు ముప్పు..! ఆ కారాణాలతో జ‌రిగే అవ‌కాశాలు లేవు..!! ఆందోళ‌న‌లో కేకేఆర్, ఆర్సీబీ
GST Relief on Insurance: జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న GST భారం! - త్వరలోనే నిర్ణయం
జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న GST భారం! - త్వరలోనే నిర్ణయం
Gautham Ghattamaneni: మహేష్ తనయుడి నటనకు అభిమానులు ఫిదా... గౌతమ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా, హాలీవుడ్ ఎంట్రీ ప్లాన్?
మహేష్ తనయుడి నటనకు అభిమానులు ఫిదా... గౌతమ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా, హాలీవుడ్ ఎంట్రీ ప్లాన్?
IPL 2025 SunRisers Hyderabad: కాటేరమ్మ కొడుకులు తగ్గేదేలే, ఈసారి మ‌రింత బ‌లంగా SRH - ఆరెంజ్ ఆర్మీ బలాలివే
కాటేరమ్మ కొడుకులు తగ్గేదేలే, ఈసారి మ‌రింత బ‌లంగా SRH - ఆరెంజ్ ఆర్మీ బలాలివే
Pawan Kalyan: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Embed widget