News
News
X

Punjab Blast: ఆర్మీ క్యాంప్ ఆఫీస్ వద్ద గ్రనేడ్ బ్లాస్ట్.. అధికారులు హైఅలర్ట్

పఠాన్‌కోట్‌లోని ఆర్మీ క్యాంప్ వద్ద గ్రనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

FOLLOW US: 

పంజాబ్​ పఠాన్‌కోట్​లోని ఆర్మీ క్యాంప్ వద్ద గ్రనేడ్ పేలుడు కలకలం రేపింది. ధీరాపుల్​ వద్ద ఉన్న ఆర్మీ క్యాంప్​ ఎదుట ఈ రోజు ఉదయం పేలుడు జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు.

" పఠాన్‌కోట్‌లోని ఆర్మీ క్యాంపు త్రివేణి గేటు వద్ద గ్రెనేడ్ పేలుడు జరిగింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. సీసీటీవీ పుటేజిని పరిశీలిస్తున్నాం.                                             "
-  సురేంద్ర లాంబా, పఠాన్‌కోట్ ఎస్‌ఎస్‌పీ

ఎలా జరిగింది?

గుర్తుతెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి గ్రనేడ్​ను విసిరి పారిపోయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఓ వివాహం జరుగుతోందని పేర్కొన్నాయి. గ్రనేడ్ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు. ఘటనా ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిన.. గ్రనేడ్ పదార్థాలను సేకరించినట్లు తెలిపారు. పఠాన్​కోట్​లోని అన్ని పోలీస్​ చెక్​పోస్ట్​లను అప్రమత్తం చేశారు.

ఆ ఘటనలో..

2016 జనవరి 1 అర్ధరాత్రి దాటాక భారత ఆర్మీ దుస్తుల్లో ఉన్న కొందరు సాయుధులు పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని పఠాన్‌కోట్‌ ఎయిర్ ఫోర్స్ బేస్‌పై దాడి చేశారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి. నాలుగు రోజులకు ఆపరేషన్ ముగిసింది.

ఈ మొత్తం ఆపరేషన్‌లో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది గాయపడ్డారు. ఐదుగురు సాయుధులు హతమయ్యారని భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ దాడి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తోన్న మిలిటెంట్ గ్రూప్ జైషే మహ్మద్ పనేనని భారత్ తేల్చింది. 

Also Read: షాకింగ్ అధ్యయనం... గర్భస్థ శిశువుకు ప్రాణాంతకంగా మారిన ఆ వేరియంట్, ప్రసవ సమయాల్లో పెరిగిన మరణాలు

Published at : 22 Nov 2021 10:08 AM (IST) Tags: punjab jammu and kashmir Pathankot Army camp Grenade blast

సంబంధిత కథనాలు

Elon Musk Twitter Deal: ట్విట్టర్ టేకోవర్‌కు ఎలన్‌మస్క్‌ రెడీ- ఒక్కో షేర్‌ 54.20 డాలర్‌కు కొనేందుకు ప్రతిపాదన!

Elon Musk Twitter Deal: ట్విట్టర్ టేకోవర్‌కు ఎలన్‌మస్క్‌ రెడీ- ఒక్కో షేర్‌ 54.20 డాలర్‌కు కొనేందుకు ప్రతిపాదన!

KNRUHS: పీజీ మెడికల్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీ, దరఖాస్తు షెడ్యూలు ఇదే!

KNRUHS: పీజీ మెడికల్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీ, దరఖాస్తు షెడ్యూలు ఇదే!

టీచర్స్ ఎమ్మెల్సీల ఎన్నిక ఓటు హక్కు కోసం దరఖాస్తుల ఆహ్వానం!

టీచర్స్ ఎమ్మెల్సీల ఎన్నిక ఓటు హక్కు కోసం దరఖాస్తుల ఆహ్వానం!

హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకుల హంగామా, ఏం జరిగిందంటే?

హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకుల హంగామా, ఏం జరిగిందంటే?

Nandamuri Balakrishna: ఇంట్లో వసుంధరే అన్‌స్టాపబుల్‌’, నా మనవళ్లు నన్ను తాత అనరు: బాలయ్య ఆసక్తికర కామెంట్స్

Nandamuri Balakrishna: ఇంట్లో వసుంధరే అన్‌స్టాపబుల్‌’, నా మనవళ్లు నన్ను తాత అనరు: బాలయ్య ఆసక్తికర కామెంట్స్

టాప్ స్టోరీస్

IND vs SA 3rd T20: ఆఖరి టీ20లో టీమ్‌ఇండియా ఢమాల్‌! టాప్‌- మిడిల్‌ కొలాప్స్‌!

IND vs SA 3rd T20: ఆఖరి టీ20లో టీమ్‌ఇండియా ఢమాల్‌! టాప్‌- మిడిల్‌ కొలాప్స్‌!

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో పోరాటం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమా?, సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో పోరాటం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమా?, సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

Unstoppable with NBK Teaser release: ‘అన్‌స్టాపబుల్ 2’ టీజర్: మరింత జోష్‌తో బాలయ్య ఎంట్రీ, ఈ సారి డబుల్ ధమాకా!

Unstoppable with NBK Teaser release: ‘అన్‌స్టాపబుల్ 2’ టీజర్: మరింత జోష్‌తో బాలయ్య ఎంట్రీ, ఈ సారి డబుల్ ధమాకా!

Kareena Kapoor: కరీనాకు చేదు అనుభవం, ముంబై ఎయిర్ పోర్టులో ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టి ఏం చేశారంటే?

Kareena Kapoor: కరీనాకు చేదు అనుభవం, ముంబై ఎయిర్ పోర్టులో ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టి ఏం చేశారంటే?