Drugs in Gujarat: గుజరాత్‌లో మరోసారి మత్తు భూతం.. పాక్ బోటులో రూ.400 కోట్ల డ్రగ్స్ సీజ్
భారత తీర రక్షణ దళం, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా.. పాకిస్థాన్‌కు చెందిన పడవలో హెరాయిన్‌ను తరలిస్తున్నట్లు గుర్తించాయి.
గుజరాత్‌లో భారీగా మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు రూ.400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నట్లుగా అదికారులు ప్రకటించారు. డిఫెన్స్, గుజరాత్ ఏటీఎస్ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్) సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఈ డ్రగ్స్ మొత్తం పట్టుబడింది. అయితే, పాకిస్థాన్ పడవలో భారత ప్రాదేశిక జలాల్లోకి ఈ డ్రగ్స్ తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నట్లుగా వెల్లడించారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు.
భారత తీర రక్షణ దళం, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా.. పాకిస్థాన్‌కు చెందిన పడవలో హెరాయిన్‌ను తరలిస్తున్నట్లు గుర్తించాయి. భారత జలాల్లోకి పడవ ప్రవేశించగానే వెంబడించి నిలిపివేశాయి. అందులోని 77 కిలోల హెరాయిన్‌ను గుర్తించారు. పడవలో ప్రయాణిస్తున్న ఆరుగురిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. కచ్ జిల్లాలోని జఖావు తీరానికి పాకిస్థాన్ పడవను తీసుకొచ్చినట్లుగా అధికారులు సోమవారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపారు.
గతంలో రూ.600 కోట్ల డ్రగ్స్
గత కొద్ది రోజులుగా ఇటీవలి కాలంలో గుజరాత్‌లో వరుసగా డ్రగ్స్ పదార్థాలు బయట పడుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో ముంద్రా పోర్టులో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుపడ్డాయి. రూ.21 వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలు అదానీకి చెందిన నౌకాశ్రయంలో సీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మరోసారి మాదకద్రవ్యాలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: TSRTC: తెలంగాణ ఆర్టీసీ గ్రేట్ ఆఫర్.. వంద టికెట్‌పై రూ.20 డిస్కౌంట్, వీరికి మాత్రమే..
ఈ ఏడాది ఏప్రిల్‌లో కోస్ట్‌గార్డ్, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 30 కేజీల హెరాయిన్‌ను సీజ్ చేశారు. పాకిస్థాన్ జాతీయులు రవాణా చేస్తున్న ఈ డ్రగ్స్ విలువ రూ.150 కోట్లుగా లెక్క తేలింది. నవంబర్‌లో మోర్బి జిల్లాలో రూ.600 కోట్ల డ్రగ్స్ గుర్తించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీనికి ఆంధ్రప్రదేశ్‌తో లింకులు ఉన్నట్లుగా గుర్తించిన సంగతి తెలిసిందే.
#Gujarat| | #Drugs seized from #JakhauPort - #Kutch.#IndianCoastGuard, in a joint operation with #GujaratATS, has apprehended a Pakistani fishing boat with 6 man, carrying 77 kgs of #Heroin worth Rs 400 crores.. pic.twitter.com/7MXKZBrXZL
— Ranjit Kanan Atman (@KananRanjit) December 20, 2021
Also Read: Gold-Silver Price: రెండోరోజూ స్థిరంగా బంగారం.. నేల చూపులు చూసిన వెండి.. నేటి ధరలు ఇవీ