TSRTC: తెలంగాణ ఆర్టీసీ గ్రేట్ ఆఫర్.. వంద టికెట్‌పై రూ.20 డిస్కౌంట్, వీరికి మాత్రమే..
హైదరాబాద్‌లో ఇందిరా పార్క్ దగ్గర ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తకాల పండుగ శనివారం ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనలు పాటిస్టూ బుక్ ఫేయిర్‌ను నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లో తరచూ బస్సుల్లో తిరిగే వారికి శుభవార్త. రూ.100 స్పెషల్ టికెట్‌పై రూ.20 తగ్గింపును ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం నడుస్తున్న బుక్ ఫెయిర్ నేపథ్యంలో ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లుగా సజ్జనార్ ప్రకటించారు. ప్రస్తుతం ఇందిరా పార్కు సమీపంలోని ఎన్టీఆర్ మైదానంలో ఈ నేషనల్ బుక్ ఫెయిర్ జరుగుతోంది. ఈ పుస్తక ప్రదర్శనను సాధ్యమైనంత ఎక్కువ మంది సందర్శించేలా కీలక ప్రకటన చేసింది.
విజ్ఞానాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో రూ.వంద ఉండే ప్రత్యేక టికెట్‌పై 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లుగా టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీఎస్ సజ్జనార్ ప్రకటన చేశారు. నగరంలో 24 గంటలపాటు తిరిగేలా రూ.100 తో ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్ ఉంటుంది. ఈ టికెట్‌పై ఈ నెల 27 వరకు రూ.20 తగ్గింపు పొందవచ్చని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. నగరంలో 24 గంటలపాటు చెల్లుబాటు అయ్యే రూ.100 టీ 24 టిక్కెట్ కొనుగోలు చేసిన వారికే ఇది వర్తిస్తుందంటూ సజ్జనార్ తెలిపారు.
గతంలో మాదిరి కాకుండా.. ముందు రోజు ఏ సమయానికి ఈ టిక్కెట్ కొనుగోలు చేస్తారో.. మరుసటి రోజు అదే సమయం వరకు దీనిని వినియోగించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు దీనిని వాడుకోవాలని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో ఇందిరా పార్క్ దగ్గర ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తకాల పండుగ శనివారం ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనలు పాటిస్టూ బుక్ ఫేయిర్‌ను నిర్వహిస్తున్నారు. మాస్కులు ధరించిన వారికే లోపలికి అనుమతిస్తున్నారు. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ, ఇంగ్లీష్ తోపాటు పలు భాషలకు చెందిన పుస్తకాలు ఈ బుక్ ఫెయిర్‌లో ప్రదర్శనలో ఉంచారు. ఈనెల 27 వరకు జరిగే బుక్ ఫెయిర్ ప్రతి రోజు మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 8.30 వరకు కొనసాగుతుంది. వారాంతాలైన శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్నారు.
పుస్తక ప్రియులకు శుభవార్త, 34 #HyderabadBookFair సందర్భంగా, డిసెంబర్ 18 నుండి 27వ తేదీ వరకు NTR గార్డెన్స్‌లో బుక్ ఫెయిర్‌ను సందర్శించే వారి T24 టిక్కెట్లపై #TSRTC 20% తగ్గింపును అందిస్తోంది. #Hyderabad #sundayvibes #IchooseTSRTC @TV9Telugu @sakshinews @eenadulivenews pic.twitter.com/9rOC3kOGDY
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) December 19, 2021
Also Read: Gold-Silver Price: రెండోరోజూ స్థిరంగా బంగారం.. నేల చూపులు చూసిన వెండి.. నేటి ధరలు ఇవీ