Delhi Election Rally: 'మీ అడ్రస్ చెప్పండి, లేఖ పంపిస్తాను' - జనం మధ్యలో తన చిత్రపటం గుర్తించిన ప్రధాని మోదీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Delhi Elections: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు తలమునకలయ్యాయి. ఆర్కే పురం ర్యాలీలో ప్రధాని మోదీ ప్రచారం సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. జనం మధ్యలో తన చిత్రపటాన్ని గుర్తించి లేఖ రాస్తానన్నారు.

Delhi Election : ఢిల్లీ ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాని మోదీ ఆర్కే పురం ప్రాంతంలో పర్యటించారు. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా, పార్టీ అభ్యర్థులు, నేతలు పర్వేష్ వర్మ, కైలాష్ గెహ్లాట్, రమేష్ బిధూరి తదితరులు పాల్గొన్నారు. అయితే తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు, మోదీ.. జనాల మధ్య ఉన్న తన చిత్రపటాన్ని గుర్తించారు. తన భద్రత కోసం మోహరించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సిబ్బందిని పిలిచి, తన వద్దకు ఆ పోర్ట్రెయిట్ తీసుకురావాలని కోరారు. పోర్ట్రెయిట్‌పై అడ్రస్ రాయమని ఆ ఆర్టిస్ట్‌ను కోరడమే కాకుండా, త్వరలో అతనికి లేఖ రాస్తానని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
బడ్జెట్ ప్రసంగంపై మోదీ ఏమన్నారంటే..
బడ్జెట్‌ను ప్రస్తావిస్తూ, నెహ్రూ కాలంలో ఒక వ్యక్తి రూ.12 లక్షలు సంపాదిస్తే, నాలుగో వంతు పన్ను వసూలు చేసే వారని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. “జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో ఎవరికైనా జీతం రూ.12 లక్షలు ఉంటే అందులో నాలుగో వంతు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వంలో రూ.12 లక్షల జీతముంటే రూ.10 లక్షలు పన్నుకే పోయేది" అని మోదీ చెప్పారు. ఆ తర్వాత 10 -12 ఏళ్ల వరకు కూడా అంటే కాంగ్రెస్ టైంలో మీకు రూ.12 లక్షల జీతం ఉంటే రూ.2,60,000 పన్ను చెల్లించేవారు. నిన్నా, మొన్నా వచ్చిన బీజేపీ ప్రభుత్వంలో ఇప్పుడు రూ.12 లక్షలు సంపాదిస్తున్నా వారు కనీసం ఒక్క రూపాయి కూడా పన్ను కింద చెల్లించనక్కర్లేదు’’ అని తెలిపారు. ఇది మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ బడ్జెట్ అని కొనియాడారు. 'వికసిత్ భారత్' కలను నెరవేర్చడానికి భారతదేశంలో నాలుగు స్తంభాలను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చానన్న మోదీ.. ఆ నాలుగు స్తంభాలు రైతులు, మహిళలు, యువత, పేదలని చెప్పుకొచ్చారు.
दिल्लीवासियों को सिर्फ भाजपा पर भरोसा है क्योंकि वह जो कहती है, वो करती है। आरके पुरम में उमड़े जनसैलाब से यह साफ है कि दिल्ली में कमल खिलकर रहेगा। https://t.co/WrH22wzDIf
— Narendra Modi (@narendramodi) February 2, 2025
వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం
దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే అధికార ఆమ్ ఆద్మీ పార్టీని హేళన చేస్తూ, గత పదకొండేళ్లలో ఆప్ నగరాన్ని నాశనం చేసిందని అన్నారు. ఆప్ నేతలపై ప్రజలు కోపంగా ఉన్నారని, తమ పార్టీని కూడా ప్రజలు ద్వేషిస్తున్నారని వారికి తెలుసునని చెప్పారు. వసంత పంచమితో వాతావరణంలో మార్పు మొదలవుతుందని, అలాగే ఫిబ్రవరి 5న మూడు రోజుల తర్వాత ఢిల్లీలో అభివృద్ధి అనే కొత్త వసంతం రాబోతుందని చెప్పారు. ఈ ఏడాది ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Kejriwal: ప్రజలకు డబ్బు ఆశ చూపుతున్నారు.. నేను రాత్రంతా నిద్రపోలేదు: కేజ్రీవాల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

