PM Modi Hints on Income Tax Rebate | ఆదాయపు పన్ను మినహాయింపు గురించి మోదీ నిన్ననే చెప్పారు | ABP
నిన్న బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ ఏం మాట్లాడారో గుర్తుందా. లేకపోతే ఓ సారి వినండి. ఎందుకురా లక్ష్మీ శ్లోకం చదివారు. లక్ష్మీ మంత్రాలు చదివారు అనుకున్నారు అంతా. జెన్యూన్ గా చెప్తున్నాం మేమైతే డబ్బులు పరంగా ఏదో భారీ కానుకే ఇస్తున్నారు బాగా ఆలోచించి..అకౌంట్స్ లో డబ్బులు వేస్తారేమో అని ఓ వైల్డ్ గెస్ చేశాం. కానీ పెద్దాయన మోదీ అంతకంటే భారీ తాయిలమే ఇచ్చారు. అదే మధ్య తరగతి ఉద్యోగులకు ఆదాయపు పన్ను మినహాయింపు. 12 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తూ సంచలన ప్రకటన చేశారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. సో ఈ సంచలన ప్రకటన ఉంది కాబట్టే నిన్న మోదీ అన్ని సార్లు లక్ష్మీ నామం జపం చేశారు. అందరి మీదా లక్ష్మీ మాత కృప ఉండాలంటూ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. మనకే ఇదంతా అర్థం కావటానికి 24 గంటల టైమ్ పట్టింది.





















