News
News
X

Golden River: భారత్‌లో ప్రవహిస్తున్న బంగారం నది, జల్లెడ పట్టినకొద్దీ స్వర్ణం! ఇప్పటికీ మిస్టరీగా బంగారు రేణువులు

ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని రత్నగర్భ ప్రాంతంలో స్వర్ణరేఖ నది మొదలవుతుంది. ఈ నదిలో బంగారం దొరుకుతుంది కాబట్టి దీనికి స్వర్ణరేఖ నది అనే పేరు వచ్చింది. ఈ నది నుంచి స్థానికులు బంగారం తీసుకుంటారు.

FOLLOW US: 
Share:

Golden  River of India : మన దేశంలో ప్రవహించే ఎన్నో నదులకు భారత్ పుట్టినిల్లు అని అంటారు. ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకతతో పాటు ఓ చరిత్ర కూడా ఉంది. వర్షపు నీటి వలన లేదా ఎత్తైన పర్వతాలలో మంచు కరిగి నీటిగా మారి అవి చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమతుంటాయి. ఈ నదులపైనే ఆధారపడి ఈ నీటితోనే వ్యవసాయం, చేపలు పడుతూ కోట్లాది మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇలా మన దేశంలో మొత్తం 32నదులు ప్రవహిస్తున్నాయి. అయితే మన దేశంలో ప్రహించే ఓ నది గురించి బహుశా ఎక్కువ మంది తెలియక పోవచ్చు. అదే గోల్డెన్‌ రివర్‌. దీనినే స్వర్ణరేఖ నది అంటారు. ఇన్ని రోజులు నదుల్లో చేపలు మాత్రమే ఉంటాయని తెలుసు.! కానీ బంగారం కూడా ఉంటుందన్న విషయం మీకు తెలుసా.?

గోల్డెన్‌ రివర్‌:
ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని రత్నగర్భ ప్రాంతంలో గోల్డెన్‌ నది (స్వర్ణరేఖ నది) మొదలవుతుంది. ఈ నదిలో బంగారం దొరుకుతుంది కాబట్టి దీనికి స్వర్ణరేఖ నది అనే పేరు వచ్చింది. ఈ నది నుంచి స్థానికులు బంగారం తీసుకుంటారు. ఝర్ఖండ్‌లోని రత్నగర్భ ప్రాంతంలో పుట్టిన ఈ నది.. పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ ముందుకు సాగుతుంది. స్వర్ణ రేఖ నది నైరుతి దిశలో ఉన్న నాగ్డి గ్రామంలోని రాణి చువాన్ అనే ప్రదేశంలోని ఓ బావిలో పుట్టి.. ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 474 కిలోమిటర్ల దూరం ప్రయాణించి ఒరిస్సా దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. 

నదిలో బంగారం ఎలా దొరుకుతుంది.?
స్వర్ణరేఖ నదికి బంగారం రేణువులు లేదా చిన్నపాటి బంగారం ముద్దలు దొరకుతాయని  ఇక్కడి ప్రజలు నమ్ముతారు. రత్నగర్భ ప్రాంత ఆదివాసులకు ఈ నదిలో నిత్యం బంగారం దొరుకుతుందన్న టాక్‌ కూడా ఉంది. ఈ నదిలో బంగారు రేణువులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. శాస్త్రవేత్తలు కూడా తేల్చలేకపోయారు. అయితే వెస్ట్‌ ఆఫ్రీకా ఖండంలోని సియర్రా లియోన్‌ అనే చిన్న దేశంలో ఏవిధంగా అయితే నీటిలో వజ్రాలను వెతుకుతారో.. అదే విధంగా ఇక్కడ కూడా బంగారం రేణువుల కోసం వేతుకుతారంటా. సుసంపన్నమైన ఖనిజసంపద కలిగిన సియెరా లియోన్ దాని ఆర్థిక పునాది కోసం మైనింగ్‌లపై ఆధారపడింది. ఇది అగ్ర పది వజ్రాలు ఉత్పత్తి దేశాలలో ఒకటిగా ఉంది. ఖనిజ ఎగుమతులు ప్రధాన కరెన్సీగా ఉంది.

సియెరా లియోన్ దేశంలో ఎక్కువగా రత్నాలు, నాణ్యమైన వజ్రాల దొరుకుతుంటాయి. స్వర్ణరేఖ నదిలో బంగారం రేణువులు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఈ నది కింద భాగంలో ఏమైన బంగారం నిధి ఉందా..? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకలేదు. ఈ నదిలో చాలా సార్లు సైంటిస్టులు పరిశోధనలు చేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు దొరకలేదంటా. కానీ, నిత్యం ఎవరికో ఒక్కరికి ఇలా బంగారం రేణువులు దొరుకుతూనే ఉన్నాయి. 

జల్లెడ పట్టిన కొద్ది బంగారమా ?
రత్నగర్భ ప్రాంతంలో నివసించే ఆదివాసులు ఎక్కువగా ఈ బంగారం కోసం కుస్తీ పడుతుంటారు. జల్లెడతో నది ఒడ్డున కూర్చోని, బంగారం కోసం వేట కొనసాగిస్తుంటారు. అయితే ఇలా ప్రతి రోజూ దొరుకుతాయా..? అంటే లేదనే చెప్పాలి. కేవలం వర్షకాలంలో మాత్రమే బంగారు అణువులు దొరుకుతుంటాయి. అయితే ఈ బంగారు రేణువుల పరిమాణం బియ్యం గింజంత సైజులో కూడా ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో బంగారం రేణువులు చాలా తక్కువగా దొరుకుతున్నాయని తెలిపారు ఆదివాసులు. 

Published at : 13 Dec 2022 11:25 PM (IST) Tags: gold Golden River Rivers in india Gold flow water

సంబంధిత కథనాలు

Certificates in DigiLocker: ఫేక్ సర్టిఫికేట్లకు కేంద్రం చెక్, యూనివర్సిటీలకు కీలక ఆదేశాలు జారీచేసిన యూజీసీ!

Certificates in DigiLocker: ఫేక్ సర్టిఫికేట్లకు కేంద్రం చెక్, యూనివర్సిటీలకు కీలక ఆదేశాలు జారీచేసిన యూజీసీ!

Jammu Kashmir Survey: పాకిస్థాన్‌లో కలిసే ప్రసక్తే లేదన్న కశ్మీరీలు,స్వతంత్రతే కావాలని ఓ సర్వేలో వెల్లడి

Jammu Kashmir Survey: పాకిస్థాన్‌లో కలిసే ప్రసక్తే లేదన్న కశ్మీరీలు,స్వతంత్రతే కావాలని ఓ సర్వేలో వెల్లడి

PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ

PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ

Indian PM: భారత ప్రధాని విదేశాలలో పర్యటిస్తే ఎక్కడ బస చేస్తారో తెలుసా!

Indian PM: భారత ప్రధాని విదేశాలలో పర్యటిస్తే ఎక్కడ బస చేస్తారో తెలుసా!

CBSE Hall Tickets: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

CBSE Hall Tickets: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

టాప్ స్టోరీస్

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !

Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్  !

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్‌! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్‌ తెస్తున్నారు!

No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్‌! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్‌ తెస్తున్నారు!