Tuni Municipality News: తునిలో అనవసర ఇగోలకు పోయి టీడీపీ చులకన అవుతోందా?
Andhra Pradesh News: అనవసర ఇగోలలకు పోయి ప్రజల్లో టీడీపీ చులకన అవుతోందా అనే చర్చ నడుస్తోంది. మొన్న తిరుపతి, తర్వాత తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికలో జరుగుతున్న పరిణామాలపై ఆందోలన వ్యక్తమవుతోంది.

Kakinada Latest News: అధికారం అనేది ఒక మత్తు లాంటిది. అందులోనూ రాజకీయాల్లో ఒక్కసారి ఆ మత్తు తలకెక్కితే ఎలాంటి పనైనా చేయిస్తుంది అంటారు తలపండిన పాలిటీషియన్లు. ఇప్పుడు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ గొడవలు ఎన్నిక విషయంలో కూటమి అదే తప్పు చేస్తుందా అన్న అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది.
సంఖ్యా బలం లేకున్నా వైస్ ఛైర్మన్ మాకే అంటున్న తమ్ముళ్లు
తుని మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. వాటిలో ఒక సభ్యుడు మృతి చెందగా ఇంకా 29 కౌన్సిలర్లు ఉంటే అవన్నీ వైసీపీకి చెందినవే. వారిలో ఇటీవల 10 మంది టీడీపీలోకి జంప్ చేశారు. మిగిలిన వారిలో 18 మందిని మున్సిపల్ చైర్మన్ సుధారాణితో సహా క్యాంపులో ఉంచారు వైసీపీ నేతలు. లేకుంటే వారిని అధికార పార్టీ తమ వైవు లాగేస్తారనేది వారి భయం. తిరుపతిలో జరిగింది అదే.
ఇప్పుడు అదే వ్యూహంతో పదేపదే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా నాలుగోసారి కూడా అదే జరిగింది. ఎన్నిక జరపాలంటే కనీసం 14 మంది కౌన్సిలర్లు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఆసంఖ్య ఎప్పుడు 10 దాటడం లేదు. వారు కూడా వైసీపీ నుంచి టిడిపిలోకి జంపు చేసిన వారే.
Also Read: కాకినాడ శిల్పారామం ఫోటో షూట్‌లకు ప్రత్యేకం-వాటర్ పార్కు నిర్మాణంతో మరింత ఆకర్షణీయం!
మరోవైపు తమకు అన్యాయం జరుగుతుందంటూ వైసిపి కీలక నేతలైన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, కన్నబాబు, దాడిశెట్టి రాజా, ముద్రగడ పద్మ నాభం లాంటివారు పిలుపునిచ్చిన చలో తుని కూడా ఆగిపోయింది. దీంతో తుని పరిసర ప్రాంతాల్లో మంగళవారం అంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం జనాల్లో ఇదే టాపిక్ పై చర్చ మొదలైంది.
ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఏకపక్షంగా అధికారంలో ఉంది కూటమి. మరో ఒకటి రెండేళ్లలో మున్సిపాలిటీలు వాళ్ళ వశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మాత్రం దానికి అనవసరమైన ఇగోలకి టిడిపి వెళ్తుందా అన్న చర్చే సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతోంది. ఈ నెపాన్ని తునిలో దశాబ్దాలపాటు తిరుగులేని నాయకుడిగా వెలుగొందిన యనమల రామకృష్ణుడుపై పెడుతున్నారు.
గతంలో వైసిపిదీ అదే పాట
ఒకసారి 2024 ఎన్నికల ప్రచారాన్ని గుర్తు చేసుకుంటే వైసీపీ అధినేత నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్లోగన్ కళ్ళ ముందు కదలాడుతుంది. "వైనాట్ 175" అంటూ చేసిన హడావుడి మామూలుది కాదు. అసెంబ్లీలోని మొత్తం సీట్లు తమకే రావాలన్నది ఆయన స్లోగన్. అంటే అసలు సభలో ప్రతిపక్షమే ఉండొద్దా అని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయ్. దాన్ని అహంకారంగా ప్రచారం చేసిన అప్పటి ప్రత్యర్థులు ఇప్పుడు తాము కూడా అదే బాటలో ఉండడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పు పడుతున్నారు. రాజకీయాల్లో అనవసరమైన ఇగోలతో వివాదాలు సృష్టించడం వల్ల అవతల పార్టీకి ప్రజల్లో సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందనేది ఎనలిస్ట్‌ల అభిప్రాయం. దానికి గడచిన ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని వారు అంటున్నారు.
Also Read: పవన్ హిమాలయాలకు వెళ్తున్నారా - మోడీ ప్రశ్నకు పవన్ జవాబు ఏంటంటే ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

