అన్వేషించండి

Kakinada Shilparamam Latest News: కాకినాడ శిల్పారామం ఫోటో షూట్‌లకు ప్రత్యేకం-వాటర్‌ పార్కు నిర్మాణంతో మరింత ఆకర్షణీయం!

Kakinada Latest News: పెద్దలకు అహ్లదం పంచేందుకు, చిన్నారులకు విజ్ఞానంతో వినోదం అందించేందుకు ఏర్పాటైన కాకినాడ శిల్పారామం కేవలం ఫొటోషూట్‌లకు పరిమితం అవుతోంది.

Kakinada Latest News: కళలు, చేతి వృత్తుల, సంస్కృతి, సంప్రదాయాల కళా వేదికగా నిర్మితమైన శిల్పారామంలో పిల్లల ఆటస్థలం చేతి వృత్తుల స్టాల్స్‌, ఆకర్ణణీయమైన చిత్రాలు, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్మాణాలు వాటిపై రంగవల్లులు చూడచక్కగా ఉంటాయి. నడిచే దారికి ఆనుకుని ఏర్పాటు చేసిన రాతిశిల్పాలు, నిర్మాణాల గోడలపై చూడచక్కని పెయింటింగ్‌లు ప్రత్యేకంగా ఆకర్షిస్తుంటాయి. ఏపీ శిల్పారామం ఆర్ట్స్‌ క్రాఫ్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతున్న ఈ శిల్పారామం ఆశించిన స్థాయిలో అయితే అభివృద్ధి కాలేదనే చెప్పాలి.. 

కాకినాడ బీచ్‌ను ఆనుకుని ఉన్న ఈ శిల్పారామం 2013లో నిర్మాణానికి అడుగులు పడినా 2016లో అభివృద్ధికి నోచుకుంది. ఆ తరువాత 2017 డిసెంబర్‌ నెలలో కాకినాడ తీరంలోనే నిర్వహించిన బీచ్‌ ఫెస్టివల్‌ను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సంగీత విభావరితో బీచ్‌పార్కుతోపాటు శిల్పారామం ప్రజలకు గుర్తిండిపోయింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు అభివృద్ధిపరంగా ఎటువంటి అడుగులు పడకపోవడం సందర్శకులను నిరాశకు గురి చేస్తోంది. 

Also Read: చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు- జగన్‌కు దమ్ములేదు- రెండు పార్టీలపై షర్మిల ఫైర్

ప్రస్తుతం శిల్పారామంలో పర్యటించే సందర్శకులకు, ఫోటోషూట్‌లకు నిర్ణీత రేటు పెట్టి అనుమతులు ఇస్తున్నారు. అందుకకే ఇక్కడ ప్రీవెడ్డింగ్‌, బర్త్‌డే షూట్‌ల కోసం వరుస కడుతున్నారు జనం. పచ్చదనంతోపాటు ఆహ్లాదకరమైన లొకేషన్లు ఉండడంతో రోజులో పదుల సంఖ్యలో నూతన వధూవరులు, పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ కోసం ప్రీ షూట్‌లు జరుగుతున్నాయి. దీంతో శిల్పారామం కాస్త కళకళలాడుతోంది. 

విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ శిల్పారామంలో ఆహ్లాదం కోసం గడిపేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు కుటుంబసమేతంగా వస్తుంటారు. అయితే అందుకు తగ్గ ఏర్పాట్లు లేవనే విమర్శలు ఉన్నాయి. 

ఇదే ప్రాంగణంలోనే వాటర్‌ పార్కు నిర్మాణం..
శిల్పారామం ప్రాంగణంలోనే వాటర్‌ పార్కు నిర్మాణం చేపట్టింది కాకినాడ నగరపాలక సంస్థ. రూ.3 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న ఈ వాటర్‌ పార్కుకు పిల్లా పాపలతో తరలివచ్చి ఎంజాయ్‌ చేసేలా తీర్చిదిద్దుతున్నారు. అన్ని హంగులతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపు 90 శాతంకుపైగా పనులు పూర్తికాగా పెయింటింగ్‌ తుది దశ పనులు వేగంగా సాగుతున్నాయి. నెల రోజుల్లో ఈ వాటర్‌ పార్కు కూడా ప్రారంభించే అవకాశాలున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. వాటర్ పార్క్‌ జోన్ స్టార్ట్ అయితే మాత్రం జనం ఆకర్షితులవుతారని అభిప్రాయపడుతున్నారు. 

Also Read: ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
Telangana Assembly: ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
Kishan Reddy Letter : హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
Empuraan Review - ఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?
ఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs LSG Match Preview IPL 2025 | నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ | ABPKL Rahul Joins Delhi Capitals | నైట్ పార్టీలో నానా హంగామా చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ | ABP DesamRC 16 Ram Charan Peddi First Look | రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC16 టైటిల్, ఫస్ట్ లుక్ | ABP DesamRiyan Parag Fan touches Feet | రియాన్ పరాగ్ కాళ్లు మొక్కిన అభిమాని | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
Telangana Assembly: ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
Kishan Reddy Letter : హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
Empuraan Review - ఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?
ఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?
SRH Memes: లక్నోను నలిపేయడం ఖాయమే -  సన్ రైజర్స్ తో మ్యాచ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్
లక్నోను నలిపేయడం ఖాయమే - సన్ రైజర్స్ తో మ్యాచ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్
Vizag Latest News: రూ.500 ఇవ్వలేదని భర్తపై అలిగిన భార్య- పరుగులు పెట్టిన పోలీసులు - ఇంతకీ ఏం జరిగిందంటే?
రూ.500 ఇవ్వలేదని భర్తపై అలిగిన భార్య- పరుగులు పెట్టిన పోలీసులు - ఇంతకీ ఏం జరిగిందంటే?
Andhra Pradesh Latest News:ఏపీలో లోకల్ రాజకీయ రచ్చ - పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు
ఏపీలో లోకల్ రాజకీయ రచ్చ - పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
Embed widget