MS Dhoni Comments: రిటైర్ అయ్యి ఆరేళ్లయినా ఆటను ఆస్వాదిస్తున్నా.. వచ్చేెనెలలో ఐపీఎల్ బరిలోకి దిగ్గజ కెప్టెన్
భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ధోనీ. మూడు ఐసీసీ టైటిళ్లు (2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ)ను అందించిన ఏకైక భారత కెప్టెన్ అతనే కావడం విశేషం.

CSK Vs DHONI: భారత క్రికెట్లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఒక పేజీనే కేటాయించాలనేంతగా సేవ చేశాడు. 28 ఏళ్ల తర్వాత భారత్ కు వన్డే ప్రపంచకప్ ను అందించాడు. అంతేగాకుండా అంతకుముందే ఇనాగ్యురల్ టీ20 ప్రపంచకప్ లో భారత్ ను విశ్వవిజేతగా నిలిపాడు. తను క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి ఆరేళ్లు గడుస్తున్నప్పటికీ, అతని క్రేజ్ కు ఏమాత్రం ఢోకా లేకుండా పోయింది. ఇప్పటికే ధోనీ అంటే విపరీతమైన అభిమానం చూపించే క్రికెట్ ప్రేమికులకు కొదువే లేదు. తాజాగా ఒక యాప్ ను లాంచ్ చేయడం కోసం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ.. తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ఆట నుంచి దూరమై ఆరేళ్లు గడిచినప్పటికీ, తాను ఇంకా ఆటను ఆస్వాదిస్తున్నాననే పేర్కొన్నాడు. తను చిన్పప్పుడు ఎలాగైతే ఆటను ఎంజాయ్ చేశాడో, ప్రస్తుతం కూడా అలాగే తను ఉన్నట్లు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన ఐపీఎల్లో ధోనీ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈసారి తను అన్ క్యాప్డ్ ప్లేయర్ రూపంలో బరిలోకి దిగుతున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు గడిచిన ప్లేయర్లను అన్ క్యాప్డ్ ప్లేయర్ల కేటగిరీలో ఆడేందుకు ఐపీఎల్ యాజమాన్యం అవకాశం కల్పించింది. దీంతో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తనను రిటైన్ చేసుకుంది.
Sanju Samson & Dhoni at Dhoni Mobile App Launch ❤️ pic.twitter.com/POy93fkvcX
— BRUTU #AUG21 ❤️ (@Brutu24) February 20, 2025
ప్రతిభను గుర్తించండి..
తమలోని ప్రతిభను గుర్తించేలా వర్థమాన క్రికెటర్లు కృషి చేయాలని ధోనీ సూచించాడు. క్రికెట్లో తమకు ఏది బలమో దాని ఫోకస్ పెట్టి అనుకున్న లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నాడు. క్రికెట్ ను సీరియస్ గా సాధన చేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించడం తేలికేనని వ్యాఖ్యానించాడు. ఎప్పటికప్పుడు ఆటకు మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగితే కచ్చితంగా విజయవంతం అవుతామని వెల్లడించాడు. ఇక భారత్ తరపున ఆడటం తను గౌరవంగా భావించినట్లు పేర్కొన్నాడు. దేశం తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు, ఎంతో ఒత్తిడి ఉంటుందని ప్రతి మ్యాచ్ లోనూ తన వందశాతం ఇచ్చేందుకు ప్రయత్నించానని గుర్తు చేసుకున్నాడు.
ఆరేళ్లైనా క్రికెట నుంచి దూరం కాలేదు..
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అనూహ్యంగా క్రికెట్ కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సంఘటన జరిగి ఆరేళ్లు గడిచినప్పటికీ, తనలో జోష్ ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నాడు. చిన్నప్పుడు ఆట కోసం ఎంత తపించే వాడినో, ఇప్పుడు కూడా అంతటి ఇంటెన్సిటీ ఉన్నట్లు పేర్కొన్నాడు. భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ధోనీని చెప్పుకోవచ్చు. మూడు ఐసీసీ టైటిళ్లు (2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ)ను అందించిన ఏకైక భారత కెప్టెన్ అతనే కావడం విశేషం. ఇక ఐపీఎల్లోనూ తను కెప్టెన్ గా సత్తా చాటాడు. చెన్నైసూపర్ కింగ్స్ కు ఐదుసార్లు టైటిల్ అందించాడు. ఇక వచ్చేనెల 22 న జరిగే ఐపీఎల్లో ధోనీ మరోసారి మైదానంలో సందడి చేయనున్నాడు.




















