అన్వేషించండి

TG EAPCET 2025: తెలంగాణ ఎప్‌సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

EAPCET: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న 'టీఎస్ ఈఏపీసెట్-2025' నోటిఫికేషన్‌ను జేఎన్టీయూ-హైద‌రాబాద్ విడుదల చేసింది.

TG EAPCET Notification 2025: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న 'టీజీ ఈఏపీసెట్-2024' నోటిఫికేషన్‌ను జేఎన్టీయూ-హైద‌రాబాద్ ఫిబ్రవరి 20న విడుదల చేసింది. ఈ ఏడాది ఇంటర్ పరక్షలకు హాజరవుతున్నవారు, ఇంటర్ అర్హత ఉన్న విద్యార్థులు ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు  టీజీఎప్‌సెట్(TG EAPCET 2025) పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు; మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టంది. ఈఏపీసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ బి. డీన్ కుమార్ వ్యవహిరించనున్నారు. 

ఎప్‌సెట్-2025 ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు..

➥ బీఈ, బీటెక్/బీటెక్(బయోటెక్)/బీటెక్(డెయిరీ టెక్నాలజీ)/ బీటెక్(అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)/ బీఫార్మసీ/ బీటెక్(ఫుడ్ టెక్నాలజీ(FT)) / బీఎస్సీ(హానర్స్) అగ్రికల్చర్/ బీఎస్సీ(హానర్స్) హార్టికల్చర్/ బీఎస్సీ (ఫారెస్ట్రీ) /బీవీఎస్సీ & ఏహెచ్/ బీఎఫ్‌ఎస్సీ.

➥  ఫార్మా-డి.

➥ బీఎస్సీ(నర్సింగ్). 

అర్హతలు: ఈ ఏడాది ఇంటర్ (ఎంపీసీ/ బైపీసీ) లేదా తత్సమాన పరీక్షలకు హాజరవుతున్నవారు, ఇంటర్ అర్హత ఉన్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

దరఖాస్తు ఫీజు ఎంతంటే?
➥ ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ & ఫార్మాలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.900 చెల్లించాలి.
➥ ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ & ఫార్మాలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లించాలి.
➥ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా రెండు విభాగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి.
➥ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా రెండు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లించాలి.

ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం..
ఏప్రిల్ 4 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. అయితే 250 ఆల‌స్య రుసుమతో ఏప్రిల్ 9 వ‌ర‌కు, రూ.500 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 18 వ‌ర‌కు, రూ.5000 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 24 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 

పరీక్ష కేంద్రాలు:
ఎప్‌సెట్ పరీక్షల నిర్వహణకోసం తెలంగాణతోపాటు ఏపీలోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో 16 పట్టణాలు/నగరాల్లో, ఏపీలో రెండు నగరాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలో నల్లగొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఇక ఏపీలో కర్నూలు, విజయవాడలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 

ముఖ్యమైన తేదీలు..

విషయం తేదీ
నోటిఫికేషన్ వెల్లడి 20-02-2025 
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 25-02-2025  
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 04-04-2025
దరఖాస్తుల సవరణ 06-04-2025  - 08-04-2025.
రూ.250 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది 09-04-2025
రూ.500 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది 14-04-2025
రూ.2500 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది 18-04-2025
రూ.5000 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది 24-04-2025
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ 19-04-2025

పరీక్ష తేది (అగ్రి, ఫార్మా)

పరీక్ష తేది (ఇంజినీరింగ్)

29-04-2025 - 30-04-2025.

02-05-2025 - 05-05-2025

TGEAPCET 2025 Notification 

TG EAPCET 2025 OFFICIAL WEBSITE

TG EAPCET 2025: తెలంగాణ ఎప్‌సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

టాప్ హెడ్ లైన్స్

Khairatabad Bypoll Stay: ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
KTR Counter: రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Danam Nagender: ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khairatabad Bypoll Stay: ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
KTR Counter: రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Danam Nagender: ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Dorothy Telugu Trailer : ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
Irumudi Like Incident In Ongole: ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
Embed widget