Breaking News: తెలుగు రాష్ట్రాల్లో వీడని ముంపు భయం- ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు
Breaking News: తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. వరద ఉద్ధృతి తగ్గినప్పటికీ ఖమ్మం, విజయవాడ ఇంకా చాలా ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్త వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోండిక్కడ.
LIVE
Background
Breaking News: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ముంచెత్తిన వరదలు కారణంగా భారీగానే నష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వేల కోట్ల నష్టం జరిగినట్టు ప్రభుత్వాలు ప్రాథమికంగా అంచనా వేసింది. ఇంకా చాలా ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. వారికి సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు యావత్ యంత్రాంగం అందులో నిమగ్నమై ఉంది. రెండు రాష్ట్రాల్లో ప్రకృతి విధ్వంసానికి దాదాపు 40 మంది మృతి చెందినట్టు గుర్తించారు. ఇంకా కొందరు గల్లంతైనట్టు తేల్చారు వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు.
ఏపీలో పరిస్థితి చూస్తే....
వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 19 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించింది. దాదాపు రెండు వేల కిలోమీటర్ల వరకు రోడ్లు దెబ్బతిన్నట్టు అంచనా వేస్తోంది. ఇప్పటికే నీట మునిగిన బాధితలు 176 పునరావాస కేంద్రాల్లో ఉంటున్నట్టు పేర్కొంది. వీళ్ల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా 171 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపింది. 36 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. బాధితులకు ఫుడ్, వాటర్ బాటిల్స్ ఇచ్చేందుకు బోట్లు, డ్రోన్లు, హెలికాప్టర్ల ఉపయోగిస్తోంది ప్రభుత్వం. ఇంకా ఎమర్జెన్సీ టైంలో సహాయం కావాలనుకునే వాళ్లు 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయమని చెబుతోంది.
విజయవాడలోని చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. మూడు రోజులు అవుతున్నా బాహ్య ప్రపంచంతో సంబంధాలు పునరుద్ధరణ కాలేదు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. పునరావాసం, బాధితులకు అత్యవసర సేవలపై ఫోకస్ ఎక్కవ పెట్టిన ఏపీ ప్రభుత్వం జరిగిన నష్టాన్ని అంచనా వేయడంపై కూడా ఫోకస్ పెట్టింది. ఏపీలో దాదాపుగా ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు తేల్చిన ప్రభుత్వం ఇందులో వరి పంట ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. వర్షాల ప్రభావం ఉన్న ఇరవైకిపైగా జిల్లాల్లో నష్టం వాటిల్లిందన్నారు. ఆజిల్లాల్లో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలే ఎక్కువగా నష్టపోయినట్టు తెల్చింది. ఈ వర్షాల ప్రభావానికి సుమారు మూడున్నర లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో నీట మునిగితే గోదావరి జిల్లాల్లో దాదాపు 30 వేలకుపైగా ఎకరాల్లో పంట నాశనమైంది. వరిరైతులతోపాటు పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర రైతులు కూడా భారీగా నష్టపోయారు.
తెలంగాణలో నష్టాన్ని చూస్తే...
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణలో వర్షలు, వరదల కారణంగా దాదాపు 20 మందిచనిపోయారు. ఐదు వేల మందికిపైగా ప్రజలకు నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతానికి అందిన సమాచారం మేరకు వర్షాలు, వరదలతో దాదాపు ఆరువేల కోట్లు నష్టం వాటిల్లినట్టు తెలిపింది. మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, సూర్యపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీవ్ర నష్టం కలిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు నష్టం వాటిల్లింది. వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. భారీగా రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. దీని పునరుద్ధరణకు రెండువేల కోట్లకుపైగానే అవసరం ఉంటుంది. ట్రాన్స్‌కోకి కూడా భారీ నష్టం వాటిల్లింది. స్తంభాలు కూలిపోయి వైర్ల తెగిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్స్, విద్యుత్ సబ్‌స్టేషన్లు నీట మునిగిపోయాయి. వీటిని బాగు చేయడానికి రిపేర్ల కోసం దాదాపు 150 కోట్లకుపైగానే నిధులు అవసరం అవుతాయి. ఆసుపత్రుల్లో వసతులు, వీధిలైట్లు, డ్రైనేజీలు, ఇతర నష్టాలు దాదాపు 15 వందల కోట్లకుపైగానే ఉండొచ్చని అంచనాకు వచ్చారు. ఓవరాల్‌గా ఆరు వేల కోట్ల వరకు నష్టం జరిగిందని ప్రభుత్వం చెబుతోంది.
వరద బాధితులకు రూ.1 కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు
వరద బాధితుల సహాయార్ధం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.
In light of the floods impacting both the Telugu states, I am pledging a donation of 50 lakhs each to the CM Relief Fund for both AP and Telangana. Let’s collectively support the measures being undertaken by the respective governments to provide immediate aid and facilitate the…
— Mahesh Babu (@urstrulyMahesh) September 3, 2024
ట్రాక్టర్ కింద నుంచి మృతదేహాన్ని బయటకు తీసిన బెజవాడ పోలీసులు
అజిత్ సింగ్ నగర్ - గుర్తుతెలియని మృతదేహాన్ని ట్రాక్టర్ కింద నుంచి బయటకు తీసిన బెజవాడ పోలీసులు
వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ రూ.1 కోటి విరాళం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి ప్రకటించారు. ప్రస్తుతం రాష్ర్ట విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి పరిశీలించారు. * రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు
ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా ఎత్తిన అధికారులు
ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.. 70 గేట్లను పూర్తిగా ఎత్తిన అధికారులు.. సముద్రంలోకి 7,46,844 క్యూసెక్కుల నీరు.. కాలువలకు 500 క్యూసెక్కుల నీటి విడుదల.. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,47,344 క్యూసెక్కులు.. బ్యారేజీ నీటిమట్టం 17.4 అడుగులు
విజయవాడ వరద బాధితులకు నెల్లూరు ఎంపీ కోటి విరాళం
విజయవాడ వరద బాధితుల సహాయార్ధం నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.కోటి సాయం ప్రకటించారు. తన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డితో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు చెక్కు అందచేశారు.
విజయవాడ వరద బాధితుల సహాయార్ధం నెల్లూరు పార్లమెంటు సభ్యుడు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.కోటి సాయం ప్రకటించారు. తన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డితో కలిసి వెళ్లి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు కు చెక్కు అందచేశారు.#AndhraPradesh pic.twitter.com/nwPIj1okTR
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 3, 2024