అన్వేషించండి

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి

Telangana News: రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ - బీజాపూర్ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఫుట్‌పాత్‌పై ఉన్న చిరు వ్యాపారులపై దూసుకెళ్లగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 10 మందికిపైగా గాయాలయ్యాయి.

Road Accident In Rangareddy District: రంగారెడ్డి జిల్లాలో (Rangareddy District) సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ - బీజాపూర్ రహదారి వద్ద దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా.. వారిపైకి ఓ లారీ అదుపు తప్పి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందగా.. 10 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికులు క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

దూసుకొస్తోన్న లారీని చూసిన వ్యాపారులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. వ్యాపారులపైకి దూసుకెళ్లిన అనంతరం లారీ చెట్టును ఢీకొని ఆగిపోగా.. డ్రైవర్ మాత్రం క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. లారీ వేగంగా ఢీకొట్టడంతో చెట్టు నేలకూలింది. ఈ ఘటనతో రహదారిపై భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు రాములు (ఆలూరు), ప్రేమ్ (ఆలూరు), సుజాత (ఖానాపూర్)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో మృతుల బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఎటు చూసిన భీతావహమే

ప్రమాదం జరిగిన తర్వాత హైదరాబాద్ - బీజాపూర్ రహదారిపై ఎటు చూసినా భీతావహ వాతావరణమే నెలకొంది. దాదాపు 100 మీటర్ల నుంచే లారీ అదుపు తప్పిన విషయాన్ని గమనించిన వ్యాపారులు పరుగులు తీశారు. లారీ బీభత్సం సృష్టించిన అనంతరం చెట్టును ఢీకొని ఆగిపోయింది. డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రగాయాలతో ఆర్తనాదాలు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సాయంతో అతన్ని బయటకు తీసి సికింద్రాబాద్ ఆస్పత్రికి తరలించారు. కూలిన చెట్టును జేసీబీతో పక్కకు తొలగించారు. లారీ హైదరాబాద్‌లో అన్‌లోడ్ చేసి తిరిగి వికారాబాద్ వస్తోన్న క్రమంలో అదుపు తప్పడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా పేర్కొన్నారు. అయితే, ఘటనా స్థలానికి కి.మీల దూరంలో ఆదివారం కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొని బీడీఎల్ ఉద్యోగి దంపతులు మృతి చెందారు. వరుస ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డును విస్తరించాలని ఏళ్ల తరబడి కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

అటు, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Also Read: Road Accident: అడుగు దూరంలో నిలిచి అందనంత దూరానికి - చిన్నారి ఉసురు తీసిన లారీ, తెలంగాణలో తీవ్ర విషాద ఘటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget