అన్వేషించండి

Road Accident: అడుగు దూరంలో నిలిచి అందనంత దూరానికి - చిన్నారి ఉసురు తీసిన లారీ, తెలంగాణలో తీవ్ర విషాద ఘటన

Telangana News: బస్టాండుకు వెళ్లే క్రమంలో రహదారిపై నిల్చుండగా లారీ దూసుకెళ్లి ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆదివారం జరిగింది.

Five Years Old Boy Died In Accident In Sathupally: అప్పటివరకూ తమతో ఉన్న చిన్నారి ఆ తల్లిదండ్రులు చూస్తుండగానే విగతజీవిగా మారాడు. తల్లికి అడుగు దూరంలో నిలిచిన చిన్నారిని మృత్యువు లారీ రూపంలో బలి తీసుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన ఆ తల్లి గుండెలు పగిలేలా రోదించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి (Sathupally) మండలం జగన్నాథపురానికి చెందిన ఊకే రాజు, ఏపీలోని నర్సీపట్నానికి చెందిన గుడివాడ ప్రసాద్‌లు కిష్టారంలోని సింగరేణి ఓసీ ఓబీ క్యాంపులో మిషన్ ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలోనే ప్రసాద్ నర్సీపట్నంలో నివసించే తన భార్య రాజ్యలక్ష్మి, కుమార్తెలు నిహిత, విఘ్నేశ్వరిలను 2 రోజుల క్రితం సత్తుపల్లి రప్పించారు.

దూసుకొచ్చిన మృత్యువు

విజయవాడ (Vijayawada) నుంచి తిరుపతికి వెళ్లాలని వీరు ఆదివారం బయలుదేరారు. ఉదయం 7 గంటల సమయంలో రాజు, తన భార్య స్వరూపారాణి, కుమారులు యశ్వంత్ (5), దీక్షిత్‌తో కలిసి బైక్‌పై జగన్నాథపురం నుంచి కిష్టారంలోని ఓబీ క్యాంపు వద్దకు చేరుకున్నారు. అప్పటికే ప్రసాద్ కుటుంబ సభ్యులు అక్కడ వేచి ఉన్నారు. స్థానిక బస్టాండుకు వెళ్లే క్రమంలో జాతీయ రహదారి పక్కన నిల్చుని ఉండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఒక్కసారిగా వీరిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజు కుమారుడు యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రసాద్ నాలుగేళ్ల కుమార్తె నిహితకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు అక్కడికి వచ్చిన ప్రదీప్ కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. నిహిత పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు కళ్ల ముందే మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. 

Also Read: Vajedu SI Suicide News: వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Adilabad Job Fraud Case: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
Hyderabad Jewellery Shop Fined 10 Lakh: లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Doctor Murder Case: భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget