అన్వేషించండి

Vajedu SI Suicide News: వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?

Vajedu SI Suicide In Mulugu District: ఎన్‌కౌంటర్లతో వార్తాల్లో ఉండే ములుగు జిల్లా ఎస్సై సూసైడ్‌తో వార్తల్లోకి వచ్చింది. ఓ రిసార్ట్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని హరీష్‌ సూసైడ్ చేసుకున్నాడు.

Mulugu District News Today: ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న హరీష్ తుపాకితో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాజేడు మండలం ముళ్ళ కట్ట వద్ద ఉన్న హరిత రిసార్ట్‌లోని గదిలో హరీష్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. హరీష్ నిన్న హరిత హోటల్లో రూం తీసుకున్నాడు. హరీష్ స్వగ్రామం భూపాలపల్లి జిల్లా వెంకటేశ్వర్ల పల్లి. వ్యక్తిగత కారణాల లేక విధి నిర్వహణ ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడ అనే కారణాలు తెలియాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని  విచారణ చేపట్టారు. 

ములుగు జిల్లాలో నిన్న భారీ ఎన్ కౌంటర్ తర్వాత వాజేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం ములుగు జిల్లా చర్చనీయాంశంగా మారింది.  ఉన్నంత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

వాజేడు పోలీస్ స్టేషన్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న హరీష్ నిన్న ములుగు జిల్లా చెల్పాక అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్ కావడంతో వాహన తనిఖీల్లో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో వరుసకు కోడలు అయ్యే యువతి హరీష్ కోసం పోలీసుస్టేషన్ కు వెళ్ళింది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది హరీష్‌కు ఫోన్ చేయడంతో ఆ యువతిని హరిత ఫెరిడో రిసార్ట్‌లో దింపాలని సిబ్బందికి చెప్పారట. దీంతో ఆ యువతి రిసార్ట్ లోని 107 రూంలో దిగింది. హరీష్ సాయంత్రం సమయంలో రిసార్ట్ కు వచ్చారు. 

పెళ్ళి ప్రస్తావన..?

ఎస్సై హరీష్‌కు వరంగల్ సిటీకి చెందిన అమ్మాయితో వివాహం కుదిరింది. మరో వారం రోజుల్లో హరీష్ ఎంగేజ్మెంట్ ఉంది. అయితే వరుసకు మేనకోడలు అయ్యే అమ్మాయితో హరీష్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. పెళ్ళి విషయంలో నిన్నటి నుంచి రిసార్ట్ లో వాదన జరిగినట్లు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం సైతం గొడవ జరిగినట్లు సమాచారం. విధుల్లోకి వెళ్లేందుకు సిద్ధమై ఆరుగంటల డ్రైవర్ కు ఫోన్ సైతం చేశారట. ఇంతలోనే హరీష్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

క్షణికావేశంలో ఆత్మహత్య..!

హరీష్ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. నవంబర్ 21 వ తేదీన వాజేడు పరిధిలోని పెనుగోడు కాలనీలో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేయడంతోపాటు నిన్న ఏటూరు నగరం అడవుల్లో ఎన్ కౌంటర్ కావడం మరో వైపు నేటి నుంచి మావోయిస్టుల పీఎల్జీఎ వారోత్సవాలు ఉండడంతో హరీష్ పని ఒత్తిడిలో ఉన్నారు. ఇదే సమయం యువతి పెళ్లి విషయంలో ఒత్తిడి తేవడం, పెళ్లి చేసుకుంటే తన పరిస్థితి ఏంటని ఆమె నిలదీయడంతో  గొడవ జరగడంతో క్షణికావేశానికి లోనైన హరీష్ ఆ  యువతి ఎదుటే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నాడు.

హరీష్ మెడకు చున్నీ ఉంది. రక్తం కారుతుండటంతో సదర్ యువతే మెడకు చున్ని చుట్టినట్లు తెలుస్తుంది.  ఘటన స్థలంలో ఆ యువతి తప్ప మరెవరూ లేరు. పోలీస్ విచారణ తరువాత హరీష్ ఆత్మహత్య కు గల పూర్తి వివరాలు తెలియనున్నాయి.

పోలీస్ లో టెన్షన్...

నిన్న జరిగిన ఎన్కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు మృతి చెందడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం బిజీ గా ఉన్నారు. మృతదేహాలు ములుగు ఏరియా ఆస్పత్రిలో ఉండడంతో అధికారులు అక్కడే అన్నారు. ఇదే సమయంలో ఎస్సై హరీష్ ఆత్మహత్య చేసుకోవడంతో  టెన్షన్ లో పడ్డారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget