Unstoppable With NBK Season 4 Ep 6 Promo | Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desam
అన్ స్టాపబుల్ సీజన్ 4 లో ఆరో ఎపిసోడ్ ప్రోమో రిలీజైపోయింది. ఈ ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి రచ్చ చేయటానికి యంగ్ సెన్సేషన్స్ నవీన్ పోలిశెట్టి, శ్రీలీల వచ్చేశారు. ఇద్దరూ కలిసి అనగనగా ఒక రాజు అనే సినిమాలో నటిస్తున్నారు. నవీన్ యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్లు వాయిదా పడ్డ ఈ సినిమా మళ్లీ ట్రాక్ ఎక్కేసింది. సో కమ్ బ్యాక్ ఇంటర్వ్యూలో తనదైన స్టైల్లో ఫన్ క్రియేట్ చేస్తూ రెచ్చిపోయాడు నవీన్ పోలిశెట్టి. ఏకంగా బాలయ్యతో మీరు నేనూ ఇద్దరం MLA లే అంటూ జోకులు పేల్చాడు. నవీన్ మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్ అంట. ఇక శ్రీలీల ఎంబీబీఎస్ లో పూర్తి చేసిన మూడేళ్లు మూడు వైరల్ సాంగ్సే ఆమె సబ్జెక్టులంటూ ర్యాగింగ్ చేశాడు జాతిరత్నం. బాలయ్య కూడా జెన్ జీ లాంగ్వేజ్ తో కిస్సిక్ స్టెప్పులతో చిన్నపిల్లాడిలా మారిపోయారు. డిసెంబర్ ఆరున రిలీజ్ అవుతున్న ఈ ఎపిసోడ్ లో నవీన్ ఫన్, శ్రీలీలను ఆడుకున్న విధానం, బాలయ్యతోనే ఆడిన గేమ్స్ అన్నీ క్రాకర్ లా పేలేలా ప్రోమోలో అయితే చూపించారు.