#UITheMovie Warner Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam
ఉపేంద్ర UI సినిమా నుంచి వార్నర్ పేరుతో ఓ ట్రైలర్ వచ్చింది. టైటిల్ కి అర్థం నువ్వు నేను అని చెప్పారు ఉపేంద్ర ఓ ఇంటర్వ్యూలో. డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి వార్నర్ అంటూ ఓట్రైలర్ లాంటిది ను రిలీజ్ చేశారు ఉపేంద్ర. ఒక్కసారి ఆ ట్రైలర్ లో ఏముందో డిస్కస్ చేద్దాం.
2040 నాటికి ఈ ప్రపంచమంతా కోవిడ్ లాంటి మహమ్మారులు, యుద్ధాలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థికమాంద్యం, గ్లోబల్ వార్మింగ్ లాంటివి మనకు ప్రపంచ ఆధినేతలంతా గిఫ్ట్ గా ఇచ్చారు అని ట్రైలర్ ని ఓపెన్ చేశారు.
భారీ నగరం లాంటి నిర్మాణాలు అన్నీ ధ్వంసమైన పోయి ఉంటాయి. ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేకుండా మనుషులు బక్కచిక్కిపోయిన శరీరాలతో ఇదిగో ఇలా ఓ అరటిపండు కోసం ప్రాణాలు పోయేలా కొట్టుకుంటూ పోటీ పడుతూ ఉంటారు. ధర్మం, జాతి పేరుతో మనుషులను విభజించి కొంత మంది ఈ ప్రపంచాన్ని పాలిస్తూ ఉంటారు. బానిసల్లాగా మారిపోయిన మనుషుల బతకటం కోసం రైస్ బాల్స్, సెల్ ఫోన్ లాంటి నిత్యావాసర వస్తువులను అందిస్తూ ఉంటారు. సెల్ ఫోన్ ను నిత్య అవసరం అన్నారు ఉపేంద్ర అది గుర్తుపెట్టుకోండి. ఆ ఫుడ్ కోసం కర్రలతో కొట్టుకుంటూ ఒకడిని ఒకడు చంపుకుంటూ ఆహారం కోసం పోటీ పడుతూ ఉంటారు. వేరే జాతి వాళ్లు ఈ ఆహారం కోసం వస్తే వారిని చావబాదుతారు. లైక్ పక్క వీధిలో కుక్కలు ఈ వీధిలో కి వస్తే ఇక్కడున్న కుక్కలకు కోపం వచ్చి ఎలా దాడి చేస్తాయే అలానే చూపించారు సీన్ ని. పిల్లల బట్స్ పై జాతి ముద్రలు ఉండాలంటూ అరాచకం చేస్తున్నారు అక్కడ పాలకులు. కానీ ఆ ధ్వసంమైన నగరాల్లో భారీ ఎల్ ఈడీ స్క్రీన్లు ఉంటాయి. ఎప్పటికప్పుడు దేశాల ఘనతలను చెబుతూ ఉంటాయి. తినటానికి తిండి లేని వాళ్లంతా మొబైల్స్ లో క్రికెట్ మ్యాచ్ లు చూస్తూ ఉంటారు. స్పేస్ లోకి వేరే గ్రహాల మీదకు వెళ్లే రాకెట్స్ గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. సైనిక సంపత్తి గురించి గొప్పలు చెప్పుకుంటూ మనం సేఫ్ గా ఉంటాం రా అని వాళ్లకు వాళ్లే భరోసా ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ ప్రాంతానికి అధిపతిగా తనదైన శైలిలో విలక్షణమైన గెటప్ లో సుప్రీం కమాండర్ లా కనిపిస్తారు ఉపేంద్ర. ఆ ప్రజల దగ్గరకు వెళ్లే వాళ్లంతా ధిక్కారం అంటూ ఉపేంద్రను ఎదిరిస్తూ ఉంటారు. మీ ధిక్కారాల కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ అని ఓ మెషీన్ గన్ తీసి ఉపేంద్ర అందర్నీ కాల్చి పారేస్తున్నట్లుగా ప్రజెంట్ చేశారు.