ఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులులు సంచరిస్తూ మనుషులపై దాడులు చేస్తున్నాయి. ఇదివరకు పశువులపై దాడి చేసిన పెద్దపులులు మనుషులపై దాడి చేస్తు హతమారుస్తున్నాయి. కాగజ్ నగర్ మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మీ అనే మహిళపై విలేజ్ నంబర్ 11 వద్ద పత్తి చేనులో పత్తి ఏరుతుండగా పులి ఆమెపై పంజా విసిరి దాడి చేసి హతమార్చింది. ఈ దాడి తర్వాత మరోసారి సిర్పూర్ (టి)మండలంలోని దుబ్బగూడా శివారులో పత్తి చేనులోనే సురేష్ అనే రైతుపై పెద్దపులి దాడి చేసింది. పులి దాడి చేసిన క్రమంలో పక్కనే ఉన్న సురేష్ భార్య ఆ పులి పై రాళ్లు విసిరి తన భర్తను కాపాడుకుంది. ఈ పులి దాడిలో రౌత్ సురేష్ మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. భార్య చేసిన సాహసానికి ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. మోర్లే లక్ష్మీ తర్వాత సురేష్ పై పులి దాడి జరగడం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులుల దాడులపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్.