అన్వేషించండి
Advertisement
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Cyclone Fengal Effect | ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడులో గత మూడు, నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వర్షాలతో తిరువణ్ణామలైలో కొండ చరియలు విరిగిపడి ఐదుగురు మృతిచెందారు.
Landslide in Tiruvannamalai | చెన్నై: ఫెంగల్ తుఫాను కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరువణ్ణామలైలో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఇళ్లపై కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. సిథిలాల కింద రాజ్‌కుమార్ (32), మీనా (26), గౌతమ్, 9, ఇనియా, 7, మహా, 12, వినోదిని, 14, రమ్య, 12 ఉన్నట్లు గుర్తించారు. తిరువణ్ణామలైలోని అన్నామలైయార్ కొండ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో మంత్రి వేలు, కలెక్టర్ భాస్కర పాండియన్ తదితరులు సహాయక చర్యలు పరిశీలిస్తున్నారు. ఘటనలో 5 మంది మృతిచెందారు. రాజ్ కుమార్, మీనా, ఇనియా, గౌతమ్, వినోద్ మృతదేహాలను వెలికి తీసారు. మరింత మందిని బయటకు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion