![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Omicron Symptoms: ఈ మూడు లక్షణాలు కనిపిస్తే అది ఒమిక్రాన్ కావచ్చు... తేలికగా తీసుకోవద్దు
ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు స్వల్పంగా బయటపడతాయి... వాటిని చాలా మంది తేలికగా తీసుకుంటున్నారు.
![Omicron Symptoms: ఈ మూడు లక్షణాలు కనిపిస్తే అది ఒమిక్రాన్ కావచ్చు... తేలికగా తీసుకోవద్దు If these three symptoms appear it could be Omicron ... Do not take lightly Omicron Symptoms: ఈ మూడు లక్షణాలు కనిపిస్తే అది ఒమిక్రాన్ కావచ్చు... తేలికగా తీసుకోవద్దు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/11/1b0d2ef47ea9ec52dec8c19eb030683e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారతదేశంలో ఒమిక్రాన్ వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. వేరియంట్ లక్షణాలు స్వల్పంగా ఉండడంతో చాపకింద నీరులా పాకేస్తోంది. మళ్లీ కోవిడ్ 19 కేసుల సంఖ్య ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంటోంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు ఒమిక్రాన్ వైరస్ లో కనిపించే తేలికపాటి లక్షణాల గురించి తెలుసుకోవాలి. లేకుంటే స్వేచ్ఛగా తిరుగుతూ మరింత మందికి వ్యాప్తి చెందిస్తారు.
ఈ మూడు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త...
ఒమిక్రాన్ వైరస్ సోకితే కచ్చితంగా కనిపించే మూడు లక్షణాలు ఇవి. ఈ మూడు ఒకేసారి కనిపిస్తే తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఆ లక్షణాల వల్ల మీకు పెద్ద సమస్యగా లేకపోయినా... పక్కవారికి సోకే ప్రమాదం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ లక్షణాలు కనిపించగానే కరోనా పరీక్షలు చేయించుకుని ఐసోలేషన్లో ఉండాలి.
గొంతునొప్పి
గొంతులో మంట, నొప్పి, దురద వంటివి ఒమిక్రాన్ వల్ల కలిగే అవకాశం ఉంది. ఒమిక్రాన్ వైరస్‌ను కనిపెట్టిన తొలి వ్యక్తి, దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ మాట్లాడుతూ తేలికపాటి జ్వరంతో పాటూ గొంతు దురద ఈ వైరస్ లక్షణాలని తెలిపారు.
తలనొప్పి
తలనొప్పికి చాలా కారణాలు ఉంటాయి. కానీ ఒమిక్రాన్ వచ్చిన వేళ ఇది కూడా చాలా ముఖ్యమైన లక్షణంగానే గుర్తించారు వైద్యులు. కాబట్టి తలనొప్పి రాగానే సాధారణమే కదా అనుకోవద్దు. వైరస్ వల్ల శరీరంలో కలిగే ఇన్ఫెక్షన్ కారణంగా తలనొప్పి వస్తుంది.
ముక్కు కారడం
కరోనా ముఖ్య లక్షణం జలుబు. ముక్కుకారడం ఎక్కువవుతుంటే తేలికగా తీసుకోకండి. జలుబుతో పాటూ తలనొప్పి కూడా అనిపిస్తే టెస్ట్ చేయించుకోవాలి. ముందు ఇంట్లో మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోండి. కుటుంబ సభ్యులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది.
Also read: సెలెబ్రిటీ గాసిప్స్ ఇష్టపడేవారికి తెలివి తక్కువగా ఉంటుంది... కొత్త అధ్యయన ఫలితం
Also read: పంది గుండె మనిషికి ప్రాణం పోసింది, చరిత్రలోనే తొలిసారిగా జంతువు గుండెతో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్
Also read: ఎక్కువ సమయం ఫోన్ చూస్తున్నారా? ఈ రోగాలు తప్పవు
Also read: కుకీలు, బిస్కెట్లు మిగిలిపోయాయా... వాటితో ఈ సింపుల్ రెసిపీలు చేసుకోవచ్చు
Also read: వేడి చేస్తే తేనె విషంగా మారుతుందా? ఈ వాదనలో నిజమెంత?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)