Biscuit Recipes: కుకీలు, బిస్కెట్లు మిగిలిపోయాయా... వాటితో ఈ సింపుల్ రెసిపీలు చేసుకోవచ్చు
పిల్లలున్న ఇంట్లో బిస్కెట్లు మిగిలిపోతుంటాయి. వాటితో చేసే సింపుల్ రెసిపీలు ఇవిగో...
బిస్కెట్లు, కుకీలు మిగిలిపోయినా, అవి తినడానికి బోర్ కొట్టినా కొన్ని రకాల రెసిపీల ద్వారా వాటిని కొత్త రుచులుగా మార్చొచ్చు. మిగిలిపోయినా లేదా విరిగిపోయిన బిస్కెట్లతో చేసుకోవడానికి సులభమైన వంటకాలు ఉన్నాయి. వీటిని స్నాక్స్ గా తిరిగి పిల్లలకే పెట్టచ్చు.
సాల్ట్ బిస్కెట్లతో..
కొన్నిసార్లు సాల్ట్ బిస్కెట్లు ప్యాకెట్లోనే ముక్కలు ముక్కలు అయిపోతాయి. వీటితో టేస్టీ వెజ్ కట్లెట్స్ చేయచ్చు. ఈ బిస్కెట్లను మెత్తగా నలిపేసి ఒక గిన్నెలో వేయాలి. అందులో ఉడికించిన బంగాళాదుంపలు, క్యారెట్లు, బీట్ రూట్లను వేసి మెత్తగా ముద్దలా నలిపేయాలి. పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, చిటికెడు మసాలా, కార్న్ పొడి వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక మిశ్రమం నుంచి చిన్న ముద్దను తీసుకుని కట్లెట్ ఆకారంలో నొక్కుకుని నూనెలో వేయించాలి. పిల్లలకు ఇవి బాగా నచ్చుతాయి.
బిస్కెట్ లడ్డూ
వీటిని దేశీ లడ్డూ అని కూడా పిలచుకోవచ్చు. ఓ పది కుకీస్ లేదా బిస్కెట్లను తీసుకోవాలి. వాటిని పొడిలా నలిపేయాలి. ఆ పొడిలో అర కప్పు కండెన్స్‌డ్ మిల్క్, ఒక కప్పు కొబ్బరి కోరు, డ్రైఫ్రూట్స్ తరుగు వేసి బాగా కలపాలి. వాటిని లడ్డూల్లా చుట్టుకోవాలి. వీటిని తినడం వల్ల శక్తి, ఆరోగ్యం కూడా.
బిస్కెట్ కేక్
కుకీలు, బిస్కెట్లతో రుచికరమైన కేకును తయారుచేసుకోవచ్చు. బ్లెండర్లో 12 నుంచి 14 బిస్కెట్లు లేదా కుకీలు వేసి పావు కప్పు పాలు, పావు టీస్పూను బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెన్న, ఒక గుడ్డు (వెజిటేరియన్లు పాలు వేసుకోవచ్చు) వెనీలా ఎసెన్స్ వేసి మెత్తని మిశ్రమంలా మార్చుకోవాలి. బేకింగ్ మౌల్డ్ లో ఈ మొత్తం మిశ్రమాన్ని వేసి ఓవెన్ లో పెట్టాలి. లేదా కుక్కర్లో కూడా కేకు మౌల్డ్ లో వేసి పెట్టుకోవచ్చు. ఈ కేకు చాలా టేస్టీగా ఉంటుంది.
Also read: వేడి చేస్తే తేనె విషంగా మారుతుందా? ఈ వాదనలో నిజమెంత?
Also read: పిల్ల మామూలుది కాదు, గుద్దితే చెట్లు విరగాల్సిందే... ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గర్ల్’ వీడియో చూడండి
Also read: ముప్పై ఆరుకోట్ల మంది మాట్లాడే హిందీ, మనదేశ అధికార భాష, కానీ జాతీయ భాష కాదు
Also read: ఫేక్ వార్తలు మనుషుల భావోద్వేగాలను ఎంతగా ప్రభావితం చేస్తాయంటే.... ఓ కొత్త అధ్యయన ఫలితం
Also read: కాఫీ తాగే పద్దతి ఇది... మీ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించాల్సిందే
Also read: బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, పాలు కలిపి తింటున్నారా? ఈ సమస్య ఉన్న వాళ్లు తినకూడదు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.