Viral Video: పిల్ల మామూలుది కాదు, గుద్దితే చెట్లు విరగాల్సిందే... ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గర్ల్’ వీడియో చూడండి
ప్రపంచంలోనే బలమైన అమ్మాయి ఎన్వికా సావకాస్. ఆమె వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
‘మీకు చెట్లు నరకడానికి కత్తులు, గొడ్డళ్లు కావాలేమో... నాకు పిడికిలి చాలు’ అని బాలయ్య రేంజ్‌లో డైలాగులు కొడుతోంది పన్నెండేళ్ల అమ్మాయి. ఆమె ఊరకే అలా చెప్పడం లేదు, నిజంగానే పిడికిలితో గుద్ది చెట్లను పడగొట్టేస్తోంది. ఆ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఆమెను ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గర్ల్’అని పిలుస్తున్నారిప్పుడు. పేరు ఎన్వికా సావకాస్. నివసించేది రష్యాలో. ఎన్వికా తండ్రి రుస్త్రమ్ బాక్సింగ్ నిపుణుడు. చిన్నప్పట్నించి అతడినే చూసిన ఎన్వికా తాను కూడా చాలా చిన్నవయసులోనే బాక్సింగ్ ప్రారంభించింది. ఎనిమిదేళ్లకే నిమిషంలో వంద పంచ్ లు విసిరి రికార్డు సృష్టించింది. కూతురి ప్రతిభను చాలా చిన్నవయసులోనే గుర్తించాడు తండ్రి. ఆయన ఇతర పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఎన్వికా కూడా ఆసక్తిగా చూసి నేర్చుకునేది. ఆమె టాలెంట్, ఇష్టాన్ని గుర్తించి మరింతగా శిక్షణనిచ్చి పదునుతేల్చాడు తండ్రి.
ఎన్వికా నివసించే ప్రాంతంలో అడవులు ఉన్నాయి. అందుకే చిన్నప్పట్నించే అడవుల్లోనే శిక్షణ పొందేవారు. చెట్లనే పంచింగ్ బ్యాగ్ లుగా ఉపయోగించేవారు. అందుకే ఆమె ఇప్పుడు చెట్టునే పిడిగుద్దులతో పడేసేంత శక్తిమంతంగా తయారైంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో వైరల్ అయింది. అందులో ఎన్వికా బాక్సింగ్ చేస్తూ చెట్టును పడగొట్టేసింది. ఆమె కొట్టే పంచ్ కు చెట్టు చిన్న చిన్క ముక్కలుగా రాలిపోయింది. ఆ వీడియోను మీరూ చూసి ఆనందించండి.
Watch Little Evnika Saadvakass also known as the 'World's Strongest Girl' punching down a tree using her Amazing boxing skills.
— Quarantine Traders (@QuarantineTrad1) January 8, 2022
Shes has been training hard since she was three and dreams of becoming a professional boxer one day. pic.twitter.com/A4ERWjB57b
View this post on Instagram
Also read: ఫేక్ వార్తలు మనుషుల భావోద్వేగాలను ఎంతగా ప్రభావితం చేస్తాయంటే.... ఓ కొత్త అధ్యయన ఫలితం
Also read: బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, పాలు కలిపి తింటున్నారా? ఈ సమస్య ఉన్న వాళ్లు తినకూడదు
Also read: నా పేరు కోవిడ్... నేను వైరస్‌ను కాను, పేరుతో ఆ కోటీశ్వరుడికి కష్టాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.