Problem with Name: నా పేరు కోవిడ్... నేను వైరస్‌ను కాను, పేరుతో ఆ కోటీశ్వరుడికి కష్టాలు
కోవిడ్ పేరు వల్ల అవహేళనకు గురవుతున్న ఓ వ్యక్తి తన బాధను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఆయనో వ్యాపారవేత్త. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘హాలిడిఫై’ అనే ట్రావెల్ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు. కరోనా వచ్చాక ఆయన తన పేరుతో చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. మొన్నటి వరకు చాలా బాధపడిన ఆయన, ఇక చేసేదేమీ లేక వాటిని చూసి నవ్వుకోవడం ప్రారంభించాడు. తన పేరు వల్ల ఎదురైన అనుభవాలను ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. అతడి పేరు కోవిద్ కపూర్. అయితే ఆంగ్లంలో రాసేటప్పుడు మాత్రం Kovid అని రాస్తాడు. అందరూ అతడిని కోవిడ్ అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో ఆయన తన ట్విట్టర్ బయోలో కూడా ‘నా పేరు కోవిద్, నేను వైరస్‌ను కాదు’ అని రాసుకోవాల్సిన పరిస్థితి.
విదేశాలకు వెళ్లినప్పుడు...
విదేశాలకు వెళితే హోటల్ గదులు బుక్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది ఎదురవుతోంది అతనికి. అందరూ అతడిని కోవిడ్ అని పిలవడం, వింతగా చూసి నవ్వుకోవడం వంటివి చేశారు. వారంటే విదేశీయులు. కానీ మనదేశంలో కూడా ఇదే పరిస్థితి. కోవిద్ అనే పదం ఉందని, హనుమాన్ చాలీసాలో ఈ పేరు వస్తుందని కూడా చాలా మందికి తెలియదు. కోవిదుడు అనే పదం నుంచి కోవిద్ అనే పేరు పుట్టింది. ఆ పేరుకర్థం స్కాలర్.
ఇతని బర్త్ డేకు కేకు ఆర్డర్ ఇచ్చారు స్నేహితులు. కేకుపై రాయాల్సిన పేరు చెప్పి వచ్చేశారు. బేకరీ వాళ్లు కోవిద్ కు బదులు ‘Covid’ అని రాసి పంపించారు. ఇవొక్కటే కాదు పేరు వల్ల అతను ఎదుర్కొన్న ఇబ్బందికర సందర్భాలు ఎన్నో.
At Starbucks, the guy handing me the coffee pointed out the name to everyone else and they burst out laughing - I mostly use a fake name now. ☕️ pic.twitter.com/79STYv2uG6
— Kovid Kapoor (@kovidkapoor) January 5, 2022
For my 30th bday, my friends ordered a cake - and Amintiri automatically assumed that it's some kinda joke, and it should be spelled with a C not a K. 🎂 pic.twitter.com/3jrySteSbC
— Kovid Kapoor (@kovidkapoor) January 5, 2022
Apart from these, there have been tens of funny micro-interactions, with Amazon delivery guys, with electricians, at airport security, at hotel check-ins, etc.
— Kovid Kapoor (@kovidkapoor) January 5, 2022
The real thrill is before the start of a new interaction - is there gonna be another little joke, or not?
Also read: బరువు తగ్గించి, శక్తిని పెంచే ప్రోటీన్ షేక్.. ఇంట్లో ఇలా సులువుగా తయారుచేయచ్చు
Also read: కాఫీ తాగే పద్దతి ఇది... మీ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించాల్సిందే
Also read: పాలకూర పులావ్... పోషకాలు పుష్కలం, ఎలా చేయాలంటే...
Also read: అప్పుడప్పుడు వచ్చి పోయే ఈ లక్షణాలు చాలా ప్రమాదకరం, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు
Also read: కుకీస్‌కు బిస్కెట్లకు మధ్య తేడా ఏంటి? పిల్లలకు ఏవి పెడితే బెటర్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.