Protein Shake: బరువు తగ్గించి, శక్తిని పెంచే ప్రోటీన్ షేక్.. ఇంట్లో ఇలా సులువుగా తయారుచేయచ్చు
జిమ్‌కెళ్లే వారు కచ్చితంగా తాగే పానీయం ప్రోటీన్ షేక్. ఇవి ఆరోగ్యానకి ఎంతో మేలు చేస్తాయి.
మార్కెట్లలో ఎన్నో రకాల ప్రొటీన్ షేక్ పొడులు అందుబాటులో ఉన్నాయి. ఎంత లేదన్న వాటిని నిల్వఉంచేందుకు ఎంతో కొంత ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఆ పొడులు వాడేకన్నా ఇంట్లోనే తాజాగా ప్రొటీన్ షేక్ తయారుచేసుకుని తాగితే మంచిది. ఇది కండరాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటూ జీవక్రియకు మేలు చేస్తుంది. కేలరీలను కరిగించేందుకు సహకరిస్తుంది. బరువు కూడా తగ్గుతారు. ఉదయం వ్యాయామం చేసిన వెంటనే ప్రొటీన్ షేక్ తాగితే అత్యంత వేగంగా శక్తి అందుతుంది.
అరటిపండు-చాక్లెట్ ప్రోటీన్ షేక్
ఒక అరటిపండు, డార్క్ చాక్లెట్ రెండు చిన్న ముక్కలు, ఒక టీస్పూను చాక్లెట్ ప్రోటీన్ పౌడర్ రెడీగా పెట్టుకోవాలి. ముందుగా అరటి పండును చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అరటి పండు ముక్కలు, చాక్లెట్ ముక్కలు, చాక్లెట్ ప్రొటీన్ పొడి కలిపి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. తరువాత పాలు వేసి మళ్లీ మిక్సీ ఆన్ చేయాలి. మిశ్రమాన్ని ఒక గ్లాసులో వేసుకోవాలి. వేసవిలో అయితే రెండు ఐసుముక్కలు వేసుకోవచ్చు. ప్రొటీన్ షేక్ సిద్ధమైనట్టే.
పెరుగు, కివి పండ్లతో
ఒక కప్పు పెరుగు, కివీ పండు ఒకటి, ఒక టీస్పూను అవిసెగింజలు, ఒక టీ స్పూనూ తేనె సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు జ్యూసర్లో తొక్క తీసిన కివి పండు ముక్కలు, పెరుగు, అవిసెగింజలు వేసి గ్రైండ్ చేయాలి. తాగే ముందు పైన తేనెతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా తాగడం వల్ల బరువు తగ్గుతారు.
స్ట్రాబెర్రీలతో...
ఒక కప్పు స్ట్రాబెర్రీ ముక్కలు, ఒక కప్పు బాదం పాలు, రెండు స్పూన్ల చియా విత్తనాలను తీసుకోవాలి. జ్యూసర్లో ఈ మూడింటినీ వేసి జ్యూసీగా చేయాలి. ఈ ప్రొటీన్ షేక్‌ను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో లేదా వ్యాయామం తరువాత తాగితే చాలా మంచిది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: కాఫీ తాగే పద్దతి ఇది... మీ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించాల్సిందే
Also read: పాలకూర పులావ్... పోషకాలు పుష్కలం, ఎలా చేయాలంటే...
Also read: అప్పుడప్పుడు వచ్చి పోయే ఈ లక్షణాలు చాలా ప్రమాదకరం, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు
Also read: కుకీస్‌కు బిస్కెట్లకు మధ్య తేడా ఏంటి? పిల్లలకు ఏవి పెడితే బెటర్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.