Cookies And Biscuits: కుకీస్‌కు బిస్కెట్లకు మధ్య తేడా ఏంటి? పిల్లలకు ఏవి పెడితే బెటర్?
కుకీస్ లేదా బిస్కెట్ల మధ్య తేడా గురించి పెద్దగా పట్టించుకోం. కానీ ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఈ రెండింటినీ విడివిడిగానే చూస్తారు.
![Cookies And Biscuits: కుకీస్‌కు బిస్కెట్లకు మధ్య తేడా ఏంటి? పిల్లలకు ఏవి పెడితే బెటర్? What is the difference between cookies and biscuits? Which is better for children? Cookies And Biscuits: కుకీస్‌కు బిస్కెట్లకు మధ్య తేడా ఏంటి? పిల్లలకు ఏవి పెడితే బెటర్?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/c49d3264f05b54d259919f438fb24472_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కాఫీ లేదా టీతో పాటూ చాలా మందికి బిస్కెట్లు లేదా కుకీస్ తినే అలవాటు ఉంది. కానీ ఆ రెండింటికీ మధ్య తేడా ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఏవి తింటే ఎక్కువ మేలు జరుగుతుందో తెలుసుకున్నారా? పిల్లలకు కుకీస్ పెడితే మంచిదా లేక బిస్కెట్లే బెటరా? ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
కుకీస్ అంటే
కుకీ డచ్ పదం ‘కోక్జే’ నుంచి వచ్చింది. దీని అర్థం ‘చిన్న కేక్’అని. సింపుల్‌గా చెప్పాలంటే కుకీలు అంటే చిన్నచిన్న కేకులు. దీని తయారీలో పిండి, వోట్స్, నట్స్, చాక్లెట్ చిప్స్ వంటివి ఉపయోగిస్తారు. వీటిని బేక్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. రకరకాల ఫ్లేవర్లలో ఇవి లభిస్తాయి.
బిస్కెట్స్...
బిస్కెట్ అనేది లాటిన్ పదాలు బిస్, కోక్వెర్ అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. బిస్ అంటే రెండు సార్లు, కోక్వెర్ అంటే వండినది అని అర్థం. బిస్కెట్ అంటే రెండు సార్లు వండినది అని అర్థమన్నమాట. దీన్ని వెన్న, పిండి, చక్కెర, ఉప్పుతో తయారు చేస్తారు.
రెండింటికీ మధ్య తేడా...
ప్రముఖ చెఫ్‌లు చెప్పిన దాని ప్రకారం చూస్తే కుకీస్ తయారీకి మెత్తని పిండి అవసరం, ఇక బిస్కెట్ తయారీకి గట్టి పిండి అవసరం అవుతుంది. కుకీలు బిస్కెట్ల కంటే బరువుగా ఉంటాయి, ఎక్కువ చక్కెరను కలిగి ఉంటాయి. బిస్కెట్లలో క్రీమ్ లేదా జామ్ ఫిల్ చేసిన రకాలు కూడా ఉంటాయి. కానీ కుకీస్‌లో అలాంటి రకాలు ఉండవు. బిస్కెట్లను కాల్చిన రొట్టెలతో పోల్చవచ్చు. ఈ రెండూ చేసే పని ఒక్కటే మన టీ టైమ్ ను మరింత ఆస్వాదించేలా చేస్తాయి.
పిల్లలకు ఏవి మంచివి?
రెండింటి తయారీలో తేడా ఉంది తప్ప, వాడే పదార్థాలలో పెద్దగా వ్యత్యాసం లేదు. బిస్కెట్లతో పోలిస్టే నట్స్, వోట్స్ తో చేసిన కుకీలు పెట్టడం మంచిది. బిస్కెట్లలో కూడా వోట్స్ తో చేసినవి లభిస్తున్నాయి. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉండాలంటే మాత్రం కుకీలే మంచివి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే బీట్‌రూట్ కొబ్బరి పాల సూప్... తాగితే రక్తహీనత దరిచేరదు
Also read: విడాకులకు దారితీసే ప్రధాన కారణాలు ఇవే... ఈ విషయాల్లో సర్దుకుపోవాల్సిందే
Also read: చలికాలంలో టీ బదులు వెల్లుల్లి నీళ్లు... తాగితే బరువు తగ్గుతారు, దగ్గు జలుబు దరిచేరవు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)