Brain Tumour: అప్పుడప్పుడు వచ్చి పోయే ఈ లక్షణాలు చాలా ప్రమాదకరం, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు
బ్రెయిన్ ట్యూమర్ కొన్ని ముందస్తు లక్షణాలను కలిగి ఉంటుంది.
బ్రెయిన్ ట్యూమర్ చాలా ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితి. మెదడులో క్యాన్సర్ కణితిలను కలిగి ఉంటే దాన్నే బ్రెయిన్ ట్యూమర్ అంటారు. ఈ కణితిలు కొన్నిసార్లు మెదడు లోపల భాగంలో కూడా ఏర్పడతాయి. మరికొన్నిసార్లు శరీరంలోని ఇతరాభాగాల్లో కణితి ఏర్పడి, మెదడుకు వ్యాపించిన సందర్భాలు ఉంటాయి. ఆ కణితి అభివృద్ధి చెందుతున్న వేగం, అది ఎక్కడ ఉంది, నాడీ వ్యవస్థపై ఎలా ప్రభావం చూపిస్తోంది అన్న విషయాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది. అయితే ప్రాథమిక దశలో గుర్తిస్తేనే చికిత్స సులభతరం అవుతుంది. అందుకే బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రాథమిక దశలో అప్పుడప్పుడు కొన్ని లక్షణాలు వచ్చిపోతుంటాయి. వాటిని తేలికగా తీసుకోకూడదు.
లక్షణాలు ఇవే...
మెదడులో కణితి ఉండే ప్రాంతాన్ని బట్టి రోగుల్లో కొన్ని లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.
1. వాసన శక్తి కోల్పోవడం
2. తల తిరగడం
3. మూర్చ
4. కాళ్లు, చేతులు, ముఖం ప్రాంతాల్లో బలహీనత
5. వివిధ శరీర భాగాలలో తిమ్మిరి
6. బ్యాలెన్స్‌డ్ సమస్యలు
7. గందరగోళం
8. వ్యక్తిత్వ మార్పులు
9. నిద్రమత్తు
10. వికారం, వాంతులు
11. స్పీచ్ సమస్యలు, కంటి చూపు సమస్యలు
పైన చెప్పిన లక్షణాలలో కొన్ని అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి. ప్రారంభ లక్షణాలలో తలనొప్పి, పుర్రెలో అధిక ఒత్తిడి కూడా కనిపిస్తాయి. వీటిని అంత తేలికగా తీసుకోకూడదు. మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా వైద్యులు సంప్రదించాలి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: కుకీస్‌కు బిస్కెట్లకు మధ్య తేడా ఏంటి? పిల్లలకు ఏవి పెడితే బెటర్?
Also read: చలికాలంలో టీ బదులు వెల్లుల్లి నీళ్లు... తాగితే బరువు తగ్గుతారు, దగ్గు జలుబు దరిచేరవు
Also read: విడాకులకు దారితీసే ప్రధాన కారణాలు ఇవే... ఈ విషయాల్లో సర్దుకుపోవాల్సిందే
Also read: చలికాలంలో టీ బదులు వెల్లుల్లి నీళ్లు... తాగితే బరువు తగ్గుతారు, దగ్గు జలుబు దరిచేరవు