Fake News: ఫేక్ వార్తలు మనుషుల భావోద్వేగాలను ఎంతగా ప్రభావితం చేస్తాయంటే.... ఓ కొత్త అధ్యయన ఫలితం

నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయి. వాటిని చదువుతున్న వారి భావోద్వేగాలు ఎలా ప్రభావితమవుతాయో ఓ అధ్యయనం బయటపెట్టింది.

FOLLOW US: 

ఈ మధ్యకాలంలో ఫేక్ న్యూస్ అధికమవుతుంది.  ఆ నకిలీ వార్తలు ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోవాలనిపించింది అమెరికాలోని ‘బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ’లోని పరిశోధకులకు. ముఖ్యంగా రాజకీయ తప్పుడు వార్తలు ప్రజల భావోద్వేగాలను ఎలా రెచ్చగొడుతున్నాయి, వారి ప్రతి చర్యలు ఎలా ఉంటాయి అనే విషయంపై అధ్యయనం చేశారు. ఆ అధ్యయన ఫలితాలను ‘జర్నల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్’ ప్రచురించారు. ‘నకిలీ వార్తల వ్యాప్తికి సంబంధించిన భావోద్వేగాలు నిజంగా ముఖ్యమైనవిగా మాకు కనిపించాయి, అందుకే ఈ అధ్యయనాన్ని నిర్వహించాం’ అని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన అధ్యయనకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రిస్తీ గలెట్టా హార్నర్ పేర్కొన్నారు. 

ఇలా సాగింది పరిశోధన...
గత కొన్నేళ్లుగా తప్పుదారి పట్టించే వార్తా కథనాలు అధికమవుతున్నాయి. 2020 అమెరికా ఎన్నికల్లో ఇంకా అధికంగా బైడెన్, ట్రంప్ గురించి కథనాలు ప్రచురితమయ్యాయి. వాటిని కేవలం అమెరికన్లే కాదు, చాలా దేశస్థులు చదివారు. వాటిల్లో అభ్యర్థుల ఆరోగ్యసమస్యలు, కుంభకోణాలు ఉన్నాయి. వాటిల్లో ఓ ఎనిమిది నకిలీ వార్తలు కూడా ఉన్నాయి. వాటిని 879 మందిని ఎంపిక చేసి వారికి చూపించారు. వారు ఆ వార్తను చదివాక వారికి ఎలా అనిపిస్తుందో అడిగారు. వారు చెప్పిన దాని ప్రకారం సర్వేలో పాల్గొన్నవారిని మూడు గ్రూపులుగా విభజించారు. 

హాట్ గ్రూపు
ఈ గ్రూపు వారు అన్ని భావోద్వేగాలను కలిగిఉన్నారు. వీరికి నకిలీ వార్తలు చదివినప్పుడు కోపం వస్తుంది. వారు ఇతరులతో ఈ వార్తలను పంచుకుంటారు. వాట్సాప్ లో, లేదా మాట్లాడుకుంటున్నప్పుడు వార్తల సారాంశాన్ని షేర్ చేసుకుంటారు. 

అప్‌సెట్ గ్రూపు
ప్రతికూల వార్తలు లేదా ఫేక్ న్యూస్‌ను చూసినప్పుడు వీరు చాలా అప్‌సెట్ అవుతారు. ప్రతిస్పందన చాలా ప్రతికూలంగా ఉంటుంది. డిస్ట్రబ్ అయినట్టు కనిపిస్తారు. 

కోల్డ్ గ్రూపు
ఈ గ్రూపులోని ప్రజలు చాలా కూల్ గా ఉంటారు. ఎలాంటి వార్తలు చదివినా వీరిలో ఎలాంటి ప్రతిస్పందన, ప్రతి చర్యలు ఉండవు. అంతేకాదు ఎవరితోనైనా ఆ వార్తలను పంచుకోరు కూడా. 

ఈ పరిశోధన కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం కాదు, అన్ని దేశాల్లోనూ ఈ మూడు గ్రూపుల ప్రజలు ఉంటారని వివరిస్తున్నారు అధ్యయనకర్తలు.  

Also read: బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, పాలు కలిపి తింటున్నారా? ఈ సమస్య ఉన్న వాళ్లు తినకూడదు

Also read: పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు, ముఖ్యంగా డయాబెటిక్ వారు...

Also read: నా పేరు కోవిడ్... నేను వైరస్‌ను కాను, పేరుతో ఆ కోటీశ్వరుడికి కష్టాలు

Also read: బరువు తగ్గించి, శక్తిని పెంచే ప్రోటీన్ షేక్.. ఇంట్లో ఇలా సులువుగా తయారుచేయచ్చు

Also read: కాఫీ తాగే పద్దతి ఇది... మీ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించాల్సిందే

 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

Published at : 10 Jan 2022 07:49 AM (IST) Tags: Fake news New study Human emotions ఫేక్ న్యూస్

సంబంధిత కథనాలు

Cold Shower Study: చన్నీటితో స్నానం చేస్తే బరువు తగ్గుతారా? తాజా అధ్యయనం ఏం చెప్పిందో చూడండి!

Cold Shower Study: చన్నీటితో స్నానం చేస్తే బరువు తగ్గుతారా? తాజా అధ్యయనం ఏం చెప్పిందో చూడండి!

Escaped From Cow Bum: అరే ఏంట్రా ఇదీ? ఆ స్టంట్ కోసం ఏకంగా ఆవు కడుపులోకి దూరాడు, చివరికి..

Escaped From Cow Bum: అరే ఏంట్రా ఇదీ? ఆ స్టంట్ కోసం ఏకంగా ఆవు కడుపులోకి దూరాడు, చివరికి..

Fenugreek seeds: మెంతులతో మెరుపు తీగలా మారిపోతారు, బరువు తగ్గేందుకు ఇలా చేయండి

Fenugreek seeds: మెంతులతో మెరుపు తీగలా మారిపోతారు, బరువు తగ్గేందుకు ఇలా చేయండి

Worst Person You Know: ఇతడు ‘మీకు తెలిసిన చెత్త వ్యక్తి’, అర్థం కాలేదా? ఈ ఫొటో ఎంతపని చేసిందో చూడండి!

Worst Person You Know: ఇతడు ‘మీకు తెలిసిన చెత్త వ్యక్తి’, అర్థం కాలేదా? ఈ ఫొటో ఎంతపని చేసిందో చూడండి!

Skincare Myths: అబ్బాయిలూ ఇది విన్నారా, మీకూ స్కిన్‌కేర్ అవసరమేనట-లేదంటే 30 ఏళ్లకే ముసలోళ్లైపోతారు

Skincare Myths: అబ్బాయిలూ ఇది విన్నారా, మీకూ స్కిన్‌కేర్ అవసరమేనట-లేదంటే 30 ఏళ్లకే ముసలోళ్లైపోతారు

టాప్ స్టోరీస్

Pakka Commercial Box Office: గోపీచంద్ కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ - 'పక్కా కమర్షియల్'

Pakka Commercial Box Office: గోపీచంద్ కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ - 'పక్కా కమర్షియల్'

BJP Plenary in Hyderabad: 2 రోజులు, 2 దెబ్బలు - హైదరాబాద్‌ వేదికగా బీజేపీ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తుందంటే !

BJP Plenary in Hyderabad: 2 రోజులు, 2 దెబ్బలు - హైదరాబాద్‌ వేదికగా బీజేపీ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తుందంటే !

Breaking News Telugu Live Updates: బేగంపేటలో యశ్వంత్ సిన్హాకు ఘనస్వాగతం పలికిన సీఎం కేసీఆర్

Breaking News Telugu Live Updates: బేగంపేటలో యశ్వంత్ సిన్హాకు ఘనస్వాగతం పలికిన సీఎం కేసీఆర్

Vijya Devarakonda: 'పీకే'లో రేడియోతో ఆమిర్ - 'లైగర్'లో రోజా పూల బొకేతో విజయ్ దేవరకొండ 

Vijya Devarakonda: 'పీకే'లో రేడియోతో ఆమిర్ - 'లైగర్'లో రోజా పూల బొకేతో విజయ్ దేవరకొండ