Milk And Egg: బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, పాలు కలిపి తింటున్నారా? ఈ సమస్య ఉన్న వాళ్లు తినకూడదు
గుడ్లు, పాలు కలిపి తినేవాళ్లు చాలా మంది. అయితే ఇలా తినొచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది.
చాలా మందికి బ్రేక్ ఫాస్ట్ సమయంలో గ్లాసుడు పాలు, ఉడక బెట్టిన గుడ్లు తింటారు. మరికొందరు పాలు, ఆమ్లెట్ తింటారు. కానీ ఎప్పటి నుంచో ఉన్న వాదన గుడ్లు, పాలు ఒకేసారి తినకూడదు అని. బరువు పెరగాలన్న, తగ్గాలన్నా కూడా కచ్చితంగా డైట్ చార్టులో గుడ్లు, పాలు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తినొచ్చో లేదో తెలుసుకుందాం.
ఆయుర్వేదం ఏం చెబుతోంది...
గుడ్లు చాలా మందికి ఇష్టమైన ఆహారం. ఆరోగ్యకరమైనవి కూడా. గుడ్లు, పాలు రెండింటిలోనూ ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరం, మెదడు మెరుగైన పనితీరుకు, అభివృద్ధికి ఇవి చాలా అవసరం. ఆయుర్వేదం ప్రకారం ఒకే సమయంలో రెండు రకాల ప్రోటీన్లు తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని, అలాగే ఉబ్బరం, అసౌకర్యం, కడుపునొప్పి, విరేచనాలు కూడా కలుగుతాయి.
అజీర్తి వ్యాధులున్న వాళ్లు
పాలతో గుడ్లు కలిపి తినడం వల్ల అజీర్ణానికి కారణమవుతుంది. కొందరిలో చర్మ వ్యాధులను కూడా ప్రేరేపిస్తుంది. కాబట్టి అజీర్తి సమస్యలు తరచూ కలిగేవారు పాలు, గుడ్లు కలిపి తినడం తగ్గించాలి. అయితే కేకులు వంటివి బేకింగ్ చేసేప్పుటప్పుడు గుడ్లు, పాలు కలుపుతాం. అలాంటివి తినడం వల్ల మాత్రం అజీర్తి లక్షణాలేమీ కలగవు. పచ్చిగుడ్లు తినడం వల్ల ఆహారం అరగదు, అలాగే పాలు, పచ్చిగుడ్లు కాంబినేషన్ కూడా కొందరిలో అరగకపోవచ్చు.
ఆ వ్యాధి రావచ్చు
పచ్చి గుడ్లు లేదా ఉడకని గుడ్లను పాలతో పాటూ తినడం వల్ల జీర్ణక్రియ రుగ్మతలే కాదు, సాల్మొనెల్లా వంటి వ్యాధులు కూడా రావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండు కలిపి తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే శరీరంలో బయోటిన్ లోపం ఏర్పడవచ్చు. గుడ్డులోని ప్రోటీన్లను బయోటిన్ సమ్మేళనాలతో బంధించేస్తాయి. దీనివల్ల శరీరంలో దాని శోషణకు ఆటంకం ఏర్పడుతుంది. అందుకే పచ్చిగుడ్లను పాలతో కలపడం అంత మంచి ఆలోచన కాదు.
గంట వ్యవధిలో....
పాలు, గుడ్లు రెండింటిలోనూ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి జీర్ణ సమస్యలు, పేగు సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ రెండు ప్రోటీన్ల ఫుడ్ మధ్య గంట వ్యవధి ఉండేలా చేసుకోవాలి.
Also read: పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు, ముఖ్యంగా డయాబెటిక్ వారు...
Also read: నా పేరు కోవిడ్... నేను వైరస్‌ను కాను, పేరుతో ఆ కోటీశ్వరుడికి కష్టాలు
Also read: బరువు తగ్గించి, శక్తిని పెంచే ప్రోటీన్ షేక్.. ఇంట్లో ఇలా సులువుగా తయారుచేయచ్చు
Also read: కాఫీ తాగే పద్దతి ఇది... మీ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించాల్సిందే
Also read: పాలకూర పులావ్... పోషకాలు పుష్కలం, ఎలా చేయాలంటే...
Also read: అప్పుడప్పుడు వచ్చి పోయే ఈ లక్షణాలు చాలా ప్రమాదకరం, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు
Also read: కుకీస్‌కు బిస్కెట్లకు మధ్య తేడా ఏంటి? పిల్లలకు ఏవి పెడితే బెటర్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.