Honey: వేడి చేస్తే తేనె విషంగా మారుతుందా? ఈ వాదనలో నిజమెంత?

తేనెను వేడి చేయడం ప్రమాదకరమని వింటుంటాం... అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.

FOLLOW US: 

చక్కెరకు బదులు తేనె వాడేవాళ్లు ఎంతోమంది. వేడి పాలల్లో, టీలో, నీళ్లల్లో తేనెను కలుపుకుని తాగుతుంటారు. వేడి మిశ్రమంలో తేనె కలపడం వల్ల, తేనె కూడా వేడెక్కుతుంది. ఇలా చేయడం వల్ల అది విషపూరితంగా మారే అవకాశం ఉంది. అంతేకాదు దానిలోని పోషక విలువలు కూడా తమ సుగుణాలను కోల్పోతాయి. అంటే ఆ తేనె తాగినా తాగకపోయినా ఒకటే. తేనెను వేడి చేయడం వల్ల అది జిగురులా మారే అవకాశం ఉంది. 

ఆయుర్వేదం ప్రకారం తేనెను వేడి చేయడం లేదా ఉడికించడం వంటివి చేయకూడదు. వేడి వేడి పదార్థాలలో కూడా కలపకూడదు. ఇలా వేడికి గురైన తేనె తాగడం వల్ల విషపూరిత అణువులు జీర్ణ వ్యవస్థ శ్లేష్మ పొరలకు అంటుకుని అమా అనే టాక్సిన్ గా మారుతాయి. దీనివల్ల కడుపునొప్పి కలగవచ్చు. శ్వాసక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీ, చర్మ వ్యాధులు, బరువు పెరుగడం వంటివి జరుగుతాయి. 

ఎన్నో పోషకాలు...
తేనెలో ఆరోగ్యకరమైన ఎంజైమ్‌లు, అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, డి, ఇ, కె, బితో పాటూ బీటాకెరాటిన్, ఎసెన్షియల్ ఆయిల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. కానీ వేడి చేయడం వల్ల ఇవన్నీ వాటి సహజగుణాలను కోల్పోతాయి. అవి ప్రమాదకర సమ్మేళనాలుగా మారచ్చు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ నివేదిక ప్రకారం కూడా తేనెను వండడం, వేడి చేయడం వల్ల నాణ్యత క్షీణిస్తుంది అని తెలుస్తుంది.

సహజంగానే తినాలి...
తేనెను 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వల్ల రసాయన మార్పులు తప్పవు. రుచి కూడా చేదుగా మారుతుంది. అందుకే తేనెను సహజంగానే, గది ఉష్ణోగ్రత వద్దనే తినాలి.  

Also read: పిల్ల మామూలుది కాదు, గుద్దితే చెట్లు విరగాల్సిందే... ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గర్ల్’ వీడియో చూడండి

Also read: ముప్పై ఆరుకోట్ల మంది మాట్లాడే హిందీ, మనదేశ అధికార భాష, కానీ జాతీయ భాష కాదు

Also read: ఫేక్ వార్తలు మనుషుల భావోద్వేగాలను ఎంతగా ప్రభావితం చేస్తాయంటే.... ఓ కొత్త అధ్యయన ఫలితం

Also read: కాఫీ తాగే పద్దతి ఇది... మీ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించాల్సిందే

Also read: బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, పాలు కలిపి తింటున్నారా? ఈ సమస్య ఉన్న వాళ్లు తినకూడదు

 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

Tags: Honey Heat Honey poisonous Dont Heat Honey తేనె

సంబంధిత కథనాలు

World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే

World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే

Viral news: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడాయన, ఇతడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

Viral news: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడాయన, ఇతడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

Pregnancy: గర్భంతో ఉన్నప్పుడు ఈ మందులు వాడితే ఎంత ప్రమాదమో తెలుసా? వీలైనంత వరకు వాడకపోతేనే మంచిది

Pregnancy: గర్భంతో ఉన్నప్పుడు ఈ మందులు వాడితే ఎంత ప్రమాదమో తెలుసా? వీలైనంత వరకు వాడకపోతేనే మంచిది

Fruits: ఏ పండ్లు తింటే ఏ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చో తెలుసా?

Fruits: ఏ పండ్లు తింటే ఏ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చో తెలుసా?

Green peas Dosa: పచ్చిబఠానీ దోశె, చూస్తేనే నోరూరిపోతుంది

Green peas Dosa: పచ్చిబఠానీ దోశె, చూస్తేనే నోరూరిపోతుంది

టాప్ స్టోరీస్

YSR Rythu Bharosa Scheme : చంద్రబాబుపై దత్తపుత్రుడికి విపరీతమైన ప్రేమ, వ్యవసాయం దండగన్న నాయకుడ్ని ఎందుకు ప్రశ్నించలేదు : సీఎం జగన్

YSR Rythu Bharosa Scheme : చంద్రబాబుపై దత్తపుత్రుడికి విపరీతమైన ప్రేమ, వ్యవసాయం దండగన్న నాయకుడ్ని ఎందుకు ప్రశ్నించలేదు : సీఎం జగన్

Ravela Kishore Resign To BJP : ఏపీ బీజేపీకి ఎదురు దెబ్బ - పార్టీ ఉపాధ్యక్షుడు రాజీనామా !

Ravela Kishore Resign To BJP : ఏపీ బీజేపీకి ఎదురు దెబ్బ - పార్టీ ఉపాధ్యక్షుడు రాజీనామా !

Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి

Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి

Ayyanna Vs Ambati Twitter : అంబటి వర్సెస్ అయ్యన్న - ట్విట్టర్‌లో రచ్చ రచ్చ

Ayyanna Vs Ambati Twitter : అంబటి వర్సెస్ అయ్యన్న - ట్విట్టర్‌లో రచ్చ రచ్చ