Heart Transplant: పంది గుండె మనిషికి ప్రాణం పోసింది, చరిత్రలోనే తొలిసారిగా జంతువు గుండెతో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్
అవయవమార్పిడి చరిత్రలో అపూరూపమైన రోజు. ఓ పంది గుండెను మనిషికి అమర్చారు వైద్యులు.
ఏటా ప్రపంచవ్యాప్తంగా వేల మందిలో అవయవాలు విఫలమవుతున్నాయి. గుండె, కిడ్నీలు, కాలేయం... ఇలా ప్రధాన అవయవాల వైఫల్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. వీరందరికీ అవయవమార్పిడి చేయడానికి దాతలు దొరకలేని పరిస్థితి. ఇప్పుడు త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తోంది. జంతువుల అవయవాలను మార్పిడి చేసుకుంటే వందలాది మంది రోగులు తిరిగి సామాన్య జీవితం గడిపే ఛాన్స్ ఉంటుంది. ఈ అధ్భుతమైన ప్రక్రియకు తాజాగా జరిగిన గుండె మార్పిడితో నాంది పలికారు వైద్యులు.
అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన యాభై ఏడేళ్ల డేవిడ్ బెన్నెట్‌కు గుండె సమస్య వచ్చింది. దీంతో ఆయనకు హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ చేయాలని నిర్ణయించారు వైద్యులు. జన్యుమార్పిడి చెందిన పంది గుండెను ఎనిమిది గంటల పాటూ కష్టపడి మార్పిడి చేశారు. ఆ ఆపరేషన్ అయిన 24 గంటల తరువాత బెన్నెట్ గుండెను పరిశీలించారు వైద్యులు. ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉంది. ఆపరేషన్ చేసిన కార్డియాక్ ట్రాన్స్ ప్లాంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ బార్ట్లీ గ్రిఫిత్ మాట్లాడుతూ ‘పంది గుండె బెన్నెట్ గుండెగా మారింది. అది పల్స్ (నాడీ)ను సృష్టిస్తోంది, ఒత్తిడిని కలిగిస్తోంది, ఇదే అతని హృదయం. ఇది చక్కగా పనిచేయడం చూసి మేము చాలా థ్రిల్ గా ఫీలయ్యాము, ఇంతకు ముందెప్పుడు ఇలా జరుగలేదు. ఒక జంతువు గుండెను మనిషికి అమర్చడం ఇదే తొలిసారి’ అని చెప్పారు.
(బెన్నెట్‌తో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన వైద్యుడు బార్ట్లీ గ్రిఫిత్ Image Credit: nytimes)
ఎప్పటినుంచో పరిశోధనలు...
మానవ శరీరం తిరస్కరించే వీల్లేకుండా పందులను అభివృద్ధి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. గత పదేళ్లుగా ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. కొత్త జన్యు సవరణ, క్లోనింగ్ టెక్నాలజీల ద్వారా పందుల అవయవాలు మనుషులకు కూడా నప్పేలా మార్పులు చేస్తూ వస్తున్నారు. తొలిసారి అలా జన్యు మార్పులకు గురైన పంది గుండెను మనిషికి అమర్చి విజయం సాధించారు. ఆ వ్యక్తి ఎన్ని నెలలు లేదా సంవత్సరాలు బతుకుతాడో మాత్రం వైద్యులు చెప్పలేకపోతున్నారు. ఈ పరిశోధనల్లో భాగంగా మొదట పంది కిడ్నీని బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తికి అమర్చి పరిశోధనలు చేశారు. తరువాత ప్రాణం ఉన్న మనిషిపై ప్రయోగించారు.
ఇలాంటి విధానాలు భవిష్యత్తులో వైద్య శాస్త్రంలో కొత్త శకాన్ని ప్రారంభిస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.
Also read: ‘స్క్రూ డ్రైవర్’ కాక్‌టెయిల్... ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు
Also read: ఎక్కువ సమయం ఫోన్ చూస్తున్నారా? ఈ రోగాలు తప్పవు
Also read: కుకీలు, బిస్కెట్లు మిగిలిపోయాయా... వాటితో ఈ సింపుల్ రెసిపీలు చేసుకోవచ్చు
Also read: వేడి చేస్తే తేనె విషంగా మారుతుందా? ఈ వాదనలో నిజమెంత?
Also read: పిల్ల మామూలుది కాదు, గుద్దితే చెట్లు విరగాల్సిందే... ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గర్ల్’ వీడియో చూడండి
Also read: ముప్పై ఆరుకోట్ల మంది మాట్లాడే హిందీ, మనదేశ అధికార భాష, కానీ జాతీయ భాష కాదు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.