Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
రోల్ మోడలైన కోహ్లీతో సెల్పీ కోసం ప్రయత్నించి నిరాశ పడిన నితీశ్ కు ఏకంగా అతనితో పాటు డ్రెస్సింగ్ రూంని పంచుకునే స్థాయికి ఎదిగాడు. తాజాగా కోహ్లీని తన ఫ్యామిలీతో కలిసిన నితీశ్ .. అతనితో ఫొటో కూడా దిగాడు.
Nitish Inspirational Journey: తెలుగుతేజం, భారత యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి జర్నీ చాలా గర్వపడేలా ఉంటుంది. తన ఆరాధ్య దైవం లాంటి క్రికెటర్ నుంచి సెల్ఫీ కోసం తంటాలు పడిన స్టేజీ నుంచి ఏకంగా అతని ఫ్యామిలీతోనే ఫొటో దిగే రేంజీకి నితీశ్ ఎదిగాడంటే ఎంత స్ఫూర్తిదాయకమో కదా. దీన్ని చూస్తుంటే ఇటీవలి సినిమా పుష్పలో ఒక సీన్ గుర్తు రావడం కాకతాళీయం. అందులో హీరో సీఎంతో ఫొటో కోసం భంగపడి, కసితో ఏకంగా సీఎంనే మార్చే లెవల్ కే వెళ్లిన సంఘటనలాంటిది గుర్తోస్తొంది కదా. టెంపర్మెంట్ విషయంలో దాదాపు అలాంటిదే నిజజీవితంలో నితీశ్ రెడ్డి జీవితంలో జరిగింది. తను 14 ఏళ్ల నుంచే క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అప్పటి నుంచి భారత స్టార్ విరాట్ కోహ్లీని తన రోల్ మోడల్ గా భావించేవాడు. వివిధ సందర్భాల్లో తన సెల్ఫీ కోసం ఎన్నోసార్లు ప్రయత్నించినా, విఫలమయ్యాడు. ప్రస్తుతం కోహ్లీని తన ఫ్యామిలీతో కలిసిన నితీశ్.. అతనితో ఫ్యామిలీ ఫొటో దిగే రేంజీకి ఎదిగిపోయాడు.
కసితో పోరాటం...
తనకు ఆరాధ్యుడు, ఇన్ స్పైర్ అయిన కోహ్లీని ఎలాగైనా కలవాలన్న కసితో క్రికెట్ లో మెళకువలు నేర్చుకోవడం మొదలు పెట్టాడు నితీశ్. మెల్లిగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన నితీశ్ కు కోహ్లీని కలవడం గగనమైంది. గతేడాది ఐపీఎల్ రూపంలో తనకు లక్ కలిసొచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తనను అనుహ్యంగా ఎంపిక చేసుకుంది. అలాగే అప్పటికే అతని ప్రతిభ గురించి అంతా పాకడంతో తుది జట్టులోనూ చోటు దక్కింది.. తనకు దొరికిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్న నితీశ్, అటు బంతితోనూ, ఇటు బ్యాట్ తోనూ సత్తా చాటి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది 15 ఏప్రిల్ రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో భాగంగా తొలిసారి విరాట్ తో కలిసి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. అప్పుడు నితీశ్ ఆనందానికి అవధులు లేవు. మ్యాచ్ రోజున స్వర్గంతో తేలిపోయినట్లు భావించిన నితీశ్, ఆ మధుర క్షణాలను ఆస్వాదించాడు.
Nitish Kumar Reddy's father touching Sunil Gavaskar's feet. (ABC Sport). pic.twitter.com/sVSep2kl9G
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 29, 2024
టిమిండియా డెబ్యూ క్యాప్ కోహ్లీ నుంచే..
కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 జట్టు నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో నెమ్మదిగా ఆ జట్టులో స్థానం దక్కించుకున్న నితీశ్ అక్కడ సత్తా చాటి తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఇక ఆసీస్ పర్యటనలో పేస్ ఆల్ రౌండర్ అవసరమని జట్టు యాజమాన్యం భావించడంతో నితీశ్ కు పిలుపొచ్చింది. అలాగే ఎవ్వరూ ఊహించని విధంగా పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో నితీశ్ అరంగేట్రం చేశాడు. అంతకుముందు అరంగేట్రం సందర్భంగా ఆటగాళ్లకు అందించే క్యాప్ ను నితీశ్ కు స్వయంగా కోహ్లీ అందించడం విశేషం. ఆ క్షణంలో నితీశ్ గాల్లో తేలిపోయినట్లు భావించి, తన రోల్ మోడల్ కోహ్లీని ఆలింగనం చేసుకున్నాడు. అక్కడి నుంచి వరుసగా నాలుగు టెస్టులు ఆడి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పుడు మెల్ బోర్న్ టెస్టులు క్లిష్టదశలో సూపర్ సెంచరీ (114) చేసి జట్టును ఆదుకున్నాడు. దీంతో ఈ సిరీస్ లో 58కి పైగా సగటుతో 293 పరుగులు చేసి భారత్ తరపున లీడింగ్ స్కోరర్ గా నిలిచాడు.
మరోవైపు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ని నితీశ్ ఫ్యామిలీ తాజాగా కలిసింది. నితీశ్ తండ్రి ముత్యాలు రెడ్డి.. గావస్కర్ కు సాష్టాంగ నమస్కారం చేయగా, మిగతా కుటుంబ సభ్యులు ఆశీర్వాదం తీసుకున్నారు. ఏదేమైనా కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే సామెతను నిజ జీవితంలో నితీశ్ చేసి చూపించాడని అందరూ అభినందిస్తున్నారు.
Also Read: Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..