Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
OG Team request to Pawan fans: పవన్ కళ్యాణ్ అభిమానులకు 'ఓజీ' ప్రొడక్షన్ హౌస్ డీవీవీ మూవీస్ ఒక రిక్వెస్ట్ చేసింది. అది ఏమిటో తెలుసా? ఎందుకు ఈ రిక్వెస్ట్ చేయాల్సి వచ్చిందో తెలుసా?
జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని జన సైనికులకు, పవనిజం ఫాలో అయ్యే అభిమానులకు నిర్మాణ సంస్థ డివివి మూవీస్ విజ్ఞప్తి చేసింది. ఈ రిక్వెస్ట్ వెనుక రీజన్ ఏంటి? ''ఆయన్ను ఇబ్బంది పెట్టకండ్రా... ఇంకొంచెం టైమ్ ఉంది... అల్లాడిద్దాం థియేటర్లలో'' అని అభిమానులకు చెప్పాల్సి వచ్చింది? అంటే...
మీ అభిమానం ప్రేమ మా అదృష్టం...
కానీ ఇలా ఇబ్బంది పెట్టడం సరైనది కాదు!
ఏపీలో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందు 'ఓజీ' సినిమాను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. ఎన్నికల కోసం సినిమా చిత్రీకరణలకు కొంత విరామం ఇచ్చారు. ఎన్నికలలో కూటమి భారీ విజయం సాధించడంతో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టడం వంటి విషయాలు ప్రజలు అందరికీ తెలిసినవే. దాంతో మరోసారి సినిమా చిత్రీకరణలకు బ్రేకులు పడుతూ వస్తున్నాయి.
ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల ఇంతకు ముందులా చిత్రీకరణలు చేయడం కుదరడం లేదు. అయితే... ఆల్రెడీ విడుదలైన 'ఓజీ' ప్రచార చిత్రాలు ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా పవన్ అభిమానులు ఆ సినిమా కోసం విపరీతంగా ఎదురు చూస్తున్నారు. పవన్ ఎక్కడికి వెళ్లినా సరే 'ఓజీ... ఓజీ...' అంటూ అరుస్తున్నారు. ఓసి బదులు గోవిందా అంటే పుణ్యం వస్తుంది అని పవన్ సరదాగా ఒకసారి వ్యాఖ్యానించారు.
తాజాగా రాయిచోటిలో వైసిపి నేతల చేతిలో దాడికి గురైన ఎంపీడీవో జవహర్ బాబును పవన్ పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ కూడా అభిమానులు 'ఓజీ... ఓజీ...' అని అనడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అభిమానులకు 'ఓజీ' ప్రొడక్షన్ హౌస్ డివివి మూవీస్ ఒక విజ్ఞప్తి చేసింది.
''ఓజీ' సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సినిమాను మీ ముందుకు తీసుకు రావడానికి నిరంతరం పనిచేస్తున్నాం. కానీ, మీరు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ సభలకు వెళ్లినప్పుడు సమయం, సందర్భం చూడకుండా 'ఓజీ... ఓజీ...' అని అరవడం, వారిని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. ప్రస్తుతం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఆ స్థానాన్ని, ఆ స్థాయిని గౌరవించడం మన కనీస బాధ్యత. అందుకని ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందాం'' అని పేర్కొన్నారు. 'ఓజీ' ఈ ఏడాది విడుదల అవుతుందని డివివి మూవీస్ స్పష్టం చేసింది. '2025 - OG పండుగ వైభవంగా నిలుస్తానని మేము గట్టిగా నమ్ముతున్నాం'' అని చెప్పింది.
Also Read: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
View this post on Instagram
'ఓజీ' కంటే ముందు 'హరిహర వీరమల్లు'
'ఓజీ' కంటే 'హరిహర వీరమల్లు' సినిమా ప్రేక్షకుల ముందుకు ముందుగా రానుంది. ఆ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తిగా వచ్చింది. మార్చి 28న ఆ సినిమాను విడుదల చేయాలని దర్శక - నిర్మాతలు భావిస్తున్నారు. అయితే, ఆ సమయానికి సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశాలు తక్కువ. వాయిదా పడినా, ఎలా చూసినా సరే ఈ ఏడది పవన్ నుంచి డబుల్ ధమాకా రావడం ఖాయం.
Also Read: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ