Vaishali Samanth: ఏకంగా రెహమాన్‌తోనే సాంగ్.. గూస్ బంప్స్ తెప్పించేసింది - 'ఛావా'తో ఊహించని పాపులారిటీ, అసలు ఎవరా సింగర్?
Singer Vaishali: లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ మూవీ 'ఛావా'లో 'ఆయా రే తుఫాన్' సాంగ్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. సింగర్ వైశాలి సామంత్ ఈ పాట పాడగా ఊహించని పాపులారిటీ దక్కింది.

Vaishali Samant Popular With Chaava Song: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక నటించిన లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ మూవీ 'ఛావా' (Chhaava). ఈ నెల 14న విడుదలైన సినిమా హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ (Vicky Kaushal), ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక (Rashmika Mandanna) నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. థియేటర్ల నుంచి ఎమోషన్స్, కన్నీళ్లు, నినాదాలతో బయటకు వస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ మూవీకి మరింత హైప్ తెచ్చింది. ఈ సినిమాలో 'ఆయా రే తుఫాన్' సాంగ్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన 'ఛావా' ఎమోషన్స్, ఈ పాటే వినిపిస్తోంది.
ఈ క్రమంలో సింగర్ ఎవరనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ పాట పాడింది మరాఠీ సింగర్ వైశాలి సామంత్. ఈమె ఇప్పటివరకూ చాలా హిట్ పాటలు పాడినా.. 'ఆయా రే తుఫాన్' పాటతోనే ఊహించని పాపులారిటీ దక్కించుకున్నారు. ఇర్షాధ్ కమిల్, క్షతిజ్ పట్వర్దన్ రచించిన పాటను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. ఆయన అద్భుత స్వరానికి వైశాలి తన వాయిస్‌తో ఎమోషన్‌ను మరింత పెంచారు. పాట విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.
Also Read: హీరోయిన్ ఫోనులో సీక్రెట్స్ బయట పెట్టేసిన హీరో... కయాదు తక్కువేం కాదు, 'లవ్ టుడే' హీరోని ఆడుకుంది
'ఇది ఓ గొప్ప అవకాశం'
ఏఆర్ రెహమాన్‌తో (AR Rahman) పాడే ఛాన్స్ ఇచ్చినందుకు ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞురాలై ఉంటానని సింగర్ వైశాలి సామంత్ (Vaishali Samant) తెలిపారు. 'ఛావా' సినిమాలో 'ఆయా రే తుఫాన్' (Aaya Re Tufan) తన సంగీత ప్రయాణానికి ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. 'ఏఆర్ రెహమాన్ నా గానంపై నమ్మకం ఉంచి నాకు అవకాశాన్ని కల్పించారు. ఈ పాట ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. ఆడియో లాంచ్ సందర్భంగా ఏఆర్ రెహమాన్‌తో ప్రత్యక్ష ప్రసారం చేయడం నాకు ఒక గొప్ప అవకాశం. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.' అంటూ వైశాలి తెలిపారు. ఆమెను అభినందిస్తూ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
రికార్డు కలెక్షన్లు.. ఈ రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు
దాదాపు రూ.130 కోట్లతో తెరకెక్కిన 'ఛావా' దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. దినేశ్ విజన్ సినిమాను నిర్మించగా.. ఇప్పటివరకూ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనికి పన్ను మినహాయింపు ఇచ్చాయి. బుధవారం 'ఛత్రపతి' శివాజీ జయంతి సందర్భంగా 'ఛావా'కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించింది. అలాగే, గోవాలోనూ ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అటు, మహారాష్ట్రలోనూ ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తులపై ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ సానుకూలంగా స్పందించారు.
Also Read: 'శివంగి'గా ఆనంది ఫస్ట్ లుక్ - లుంగీ కట్టుకుని నుదిటిపై విభూతితో డిఫరెంట్‌గా పవర్ ఫుల్ లేడీ





















