Shivangi First Look: 'శివంగి'గా ఆనంది ఫస్ట్ లుక్ - లుంగీ కట్టుకుని నుదిటిపై విభూతితో డిఫరెంట్‌గా పవర్ ఫుల్ లేడీ
Kayal Anandhi: టాలీవుడ్ హీరోయిన్ ఆనంది నటించిన లేటెస్ట్ మూవీ 'శివంగి'. ఈ మూవీని నుంచి ఫస్ట్ లుక్ ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి లాంఛ్ చేశారు. లుంగీకట్టులో, నుదిటిన విభూతితో ఆనంది ఆకట్టుకుంటోంది.

Kayal Anandhi's Frist Look From Shivangi Unveiled: అచ్చ తెలుగు హీరోయిన్ ఆనంది (Kayal Anandhi) లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'శివంగి' (Shivangi). దేవ్‌రాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై పి.నరేష్‌బాబు నిర్మించారు. నటి వరలక్ష్మి శరత్ కుమార్, తమిళ నటుడు జాన్ విజయ్, డాక్టర్ కోయకిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఆనంది ఫస్ట్ లుక్‌ను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) రివీల్ చేశారు. నల్లలుంగీ, చొక్కాతో కాళ్లపై కాళ్లు వేసుకుని కళ్లద్దాలు ధరించి నుదిటిపై విభూతితో ఆనంది లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్ ఫుల్ వుమెన్ సెంట్రిక్ మూవీగా 'శివంగి' ఉండనుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి A.H కాషిఫ్, ఎబినేజర్ పాల్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Happy to Unveil the Title & First look Poster of #Shivangi Movie.
— Anil Ravipudi (@AnilRavipudi) February 19, 2025
Congratulating the entire team for the grand success of the film.@anandhiActress @varusarath5 @Bharanidp #NareshBabuP #AHKaashif #SamjithMohammed #RaghuKulakarni @Teju_PRO @RainbowMedia_ @firstcopymovies pic.twitter.com/z5bXujUECT
అచ్చ తెలుగమ్మాయి మన ఆనంది
వరంగల్ జిల్లాకు చెందిన ముద్దుగుమ్మ కాయల్ ఆనంది (Kayal Anandhi).. తన అందం, అభినయం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘జాంబిరెడ్డి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ లాంటి సినిమాల్లో అద్భుతంగా నటించారు. అటు, తెలుగు, తమిళ చిత్రాలతో పాటు మలయాళ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టారు. ఆనంది చివరిసారిగా నాగచైతన్య నటించిన 'కస్టడీ'లో అతిథి పాత్రలో కనిపించారు. కయల్ మూవీతో కోలీవుడ్‌లోకి ఆమె ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె పేరు కయల్ ఆనందిగా మారింది. తమిళంలో ఇప్పటివరకూ 20కి పైగా సినిమాలు చేశారు. కాజల్ లీడ్ రోల్‌లో నటించిన లైవ్ టెలికాస్ట్ వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో కనిపించారు. పలు, క్రైమ్, థ్రిల్లర్ మూవీస్‌లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆనంది.
టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో ఆనంది కోలీవుడ్‌పై ఎక్కువగా దృష్టి సారించారు. అక్కడ మంచి కథలు ఎంచుకోవడంతో పాటు ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. హీరోయిన్‌గా మంచి గుర్తింపు రాకముందే ఆమె పెళ్లి పీటలెక్కారు. కథల ఎంపిక, కీలక రోల్స్‌కు సంబంధించి తన భర్త తనను బాగా ఎంకరేజ్ చేశారని ఆమె ఓ ఇంటర్య్వూలో చెప్పారు. డిఫరెంట్ రోల్స్‌లో నటించేందుకు సపోర్ట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Also Read: హీరోయిన్ ఫోనులో సీక్రెట్స్ బయట పెట్టేసిన హీరో... కయాదు తక్కువేం కాదు, 'లవ్ టుడే' హీరోని ఆడుకుంది





















