Return of The Dragon: హీరోయిన్ ఫోనులో సీక్రెట్స్ బయట పెట్టేసిన హీరో... కయాదు తక్కువేం కాదు, 'లవ్ టుడే' హీరోని ఆడుకుంది
Return of The Dragon: 'డ్రాగన్' హీరో హీరోయిన్లు ప్రదీప్ రంగనాథన్, కయాదు లోహర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'లవ్ టుడే' ఫోన్ ఎక్స్ఛేంజ్ సీన్ రీక్రియేట్ చేశారు. ఇద్దరి ఫోన్లలో ఏమేం సీక్రెట్స్ ఉన్నాయో తెలుసా ?

'లవ్ టుడే' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి సురేష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీని ఈనెల 21న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తుంది. రీసెంట్ గా దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరో ప్రదీప్ రంగనాథన్, హీరోయిన్ కయాదు లోహర్ 'లవ్ టుడే' సీన్ ను రీ క్రియేట్ చేసి, ఒకరి సీక్రెట్స్ మరొకరు బయట పెట్టుకున్నారు.
'లవ్ టుడే' సీన్ రీ క్రియేట్
'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ తెలుగు ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు, హీరో ప్రదీప్ రంగనాథన్, హీరోయిన్ కయాదు లోహార్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే' మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రదీప్, కయాదులను ఆ సినిమాలో పాపులర్ అయిన 'ఫోన్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం' అనే సీన్ ను రీ క్రియేట్ చేయమని అడిగారు. దీంతో వెంటనే హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరి ఫోన్ మరొకరు మార్చుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఇద్దరి ఫోన్లో ఉన్న సీక్రెట్స్ రివీల్ అయ్యాయి.
Also Read: నందమూరి అభిమానులకు షాకింగ్ న్యూస్... బాలయ్య వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఇప్పట్లో లేనట్టేనా?
ముందుగా ప్రదీప్ రంగనాథన్ హీరోయిన్ కయాదు ఫోన్లో ఉన్న ఓ సీక్రెట్ యాప్ గురించి ప్రస్తావించాడు. అందులో ఒక మీమ్ క్రియేషన్ యాప్ ఉందని చెప్పాడు. అంతేకాకుండా తెలుగు టాప్ హీరోయిన్ అని తన ఫోటో పైన తనే రాసుకుంది అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశాడు. దీంతో కయాదు "ఫస్ట్ మనల్ని మనం నమ్మితేనే ఆ తర్వాత ప్రపంచం నమ్ముతుంది. నన్ను నేను ఆ రేంజ్ లో చూడాలనుకుంటున్నాను. అందుకే అలా క్రియేట్ చేశాను" అని క్లారిటీ ఇచ్చింది.
ప్రదీప్ రంగనాథన్ మీమ్ గర్ల్ ఫ్రెండ్స్
ఇక మరోవైపు కయాదు ప్రదీప్ రంగనాథన్ ఫోను ఓపెన్ చేసి, అందులో ఎవరితో చాట్ చేస్తున్నాడు అనే విషయాన్ని చూసింది. "ఈ ఛాట్ ఎవరితో చేస్తున్నావ్? నేను పంపిన మీమ్ ను తనకెందుకు పంపించావు?" చెప్పు అని ప్రశ్నించింది. వెంటనే ప్రదీప్ రంగనాథన్ స్పందిస్తూ అసలు ఆ ఛాట్ ఎవరితో చేస్తున్నాడో తెలియనట్టుగా బిహేవ్ చేశాడు. ఆ తర్వాత హీరోయిన్ పట్టుపట్టడంతో మమతా జైజుతో చేసినట్టు వెల్లడించాడు. ఆమెకు మాత్రమే కాదు... ఇంట్రెస్టింగ్ గా కనిపించే మీన్స్ ని తనతో పాటు అనుపమ పరమేశ్వరన్ తదితరులకు షేర్ చేశానని చెప్పాడు ప్రదీప్ రంగనాథన్. "కయాదు నువ్వు ఫ్రెండ్ వి, వాళ్లు మీమ్ గర్ల్ ఫ్రెండ్స్" అని క్లారిటీ ఇచ్చాడు. ఇక కయాదు "నీ ఫోన్లోనే సీక్రెట్స్ అన్నీ ఉన్నాయి. నా ఫోన్లో అసలు ఏం లేదు, బోరింగ్ గా ఉంటుంది" అని చెప్పింది. మొత్తానికి వీరిద్దరూ కలిసి క్రియేట్ చేసిన 'లవ్ టుడే' సీన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: సమ్మేళనం రివ్యూ: విలన్ లేని ట్రయాంగిల్ లవ్ స్టోరీ... ETV Winలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

