Nandamuri Mokshagna: నందమూరి అభిమానులకు షాకింగ్ న్యూస్... మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో లేనట్టేనా?
Nandamuri Mokshagna Teja Debut: నందమూరి మోక్షజ్ఞ తేజ ఫస్ట్ మూవీ ఈ ఏడాది మొదలు కావడం కష్టమేననే వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలకు కారణం ఏంటంటే?

నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagna Teja) టాలీవుడ్ ఎంట్రీ గురించి అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే గత ఏడాది మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ నుంచి లుక్ రిలీజ్ చేయడంతో, ఆయన ఎంట్రీపై భారీ బజ్ క్రియేట్ అయింది. మోక్షజ్ఞను 70 ఎంఎం స్క్రీన్ పై చూసే ఆ క్షణం ఎప్పుడెప్పుడా అనే ఎదురు చూపులు మరింతగా ఎక్కువయ్యాయి. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే మూవీ సెట్స్ పైకి వెళ్తుందనే వార్తలతో ఫ్యాన్స్ ఆనందంతో ఎగిరి గంతేశారు. కానీ సడన్ గా ఈ మూవీ పూజా కార్యక్రమాలకే బ్రేక్ పడింది. ఇక అప్పటి నుంచి దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో నందమూరి అభిమానులు అయోమయంలో పడ్డారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఇప్పట్లో లేనట్టేనని తెలుస్తోంది.
మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో కష్టమేనా?
మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞని లాంచ్ చేసే బాధ్యతను తీసుకున్నారని అన్నారు. సినిమా మాత్రం పూజా కార్యక్రమాల వరకూ వెళ్లి సడన్ గా స్పీడ్ బ్రేక్ తో ఆగిపోయింది. ఇక ఆ తర్వాత మోక్షజ్ఞ మూవీ నుంచి ప్రశాంత్ వర్మ తప్పుకున్నాడని, వేరే దర్శకులు మోక్షజ్ఞను లాంచ్ చేస్తారంటూ పలువురు డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. ఒకానొక టైంలో స్వయంగా బాలయ్య మోక్షజ్ఞని పరిచయం చేస్తారని, 'ఆదిత్య 369' సీక్వెల్లో అతను నటిస్తున్నాడని రూమర్స్ వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ ఎంట్రీ మూవీకి డైరెక్టర్ ప్రశాంత్ వర్మనే అని తెలుస్తోంది. కానీ మోక్షజ్ఞను లాంచ్ చేయడానికి ప్రశాంత్ వర్మ మరి కాస్త టైం అడిగినట్టు టాక్ వినిపిస్తోంది.
మరో ఏడాది వెయిటింగ్ తప్పదా?
'హనుమాన్' మూవీతో 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని గత ఏడాది సంక్రాంతికి వెల్లడించారు. 'జై హనుమాన్' అంటూ మూవీ టైటిల్ ని కూడా అప్పుడే అనౌన్స్ చేశారు. ఈ మూవీలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించబోతున్నారని కొన్ని రోజుల క్రిందట అనౌన్స్ చేశారు. కానీ రిషబ్ శెట్టి ప్రస్తుతం 'కాంతార 2' మూవీ సెట్స్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ పూర్తయ్యాకే ఆయన 'జై హనుమాన్' షూటింగ్లో కాలు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎలా ఆలోచించినా 'జై హనుమాన్' మూవీ పూర్తి కావడానికి ప్రశాంత్ వర్మకి ఈ ఏడాదంతా సరిపోతుంది. అంటే మోక్షజ్ఞ నెక్స్ట్ మూవీ స్టార్ట్ కావాలంటే మరో ఏడాది వెయిటింగ్ తప్పదు అన్పిస్తోంది.
Also Read: సమ్మేళనం రివ్యూ: విలన్ లేని ట్రయాంగిల్ లవ్ స్టోరీ... ETV Winలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

