YS Jagan Latest News: వైఎస్ జగన్ భద్రతపై గవర్నర్‌కు వైసీపీ ఫిర్యాదు- ఏం తగ్గిందని ప్రశ్నిస్తున్న మంత్రి గొట్టిపాటి
YS Jagan Latest News: వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు సర్కారు నిర్లక్షంతో ఉందని గవర్నర్ నజీర్‌కు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం కూడా అదే స్టైల్‌లో రిప్లై ఇచ్చింది.

YS Jagan Latest News: వైఎస్ జగన్ భద్రతపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎంకు జెడ్‌ప్లస్ సెక్యూరిటీ ఉంటుందని కానీ కూటమి ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా ఉంటోందని ఆరోపిస్తున్నారు. గుంటూరు జిల్లాలో భద్రత లేకుండా చేశారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తగిన భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి భద్రత విషయంలో జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు వైసీపీ నేతలు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. జగన్ భద్రత పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బుధవారం గుంటూరు పర్యటనలో ఆయనకు కనీస సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
మాజీ సీఎంగా జగన్‌కు జెడ్‌ప్లస్ సెక్యూరిటీ ఉంటుందని బొత్స సత్యనారాయమ గుర్తు చేశారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స... ప్రభుత్వం కుట్ర తమకు తెలుసు అని అన్నారు. జెడ్‌ప్లస్ భద్రత ఉన్న జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ సెక్యూరిటీ ఉండాలని అభిప్రాయపడ్డారు. కానీ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనలో మాత్రం ఒక్కో కానిస్టేబుల్ కూడా లేడని ఆరోపించారు.
జగన్ మోహన్ రెడ్డి భద్రతపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు బొత్స. తమ ఫిర్యాదుపై నజీర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే భద్రతపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు బొత్స. చట్టం తన పనితాను చేసుకోకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.
Also Read: వైసీపీ నేత వల్లభనేని వంశీకి బిగ్ షాక్- ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు భద్రతపై ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని వివరించారు బొత్స. ఎన్నికల కోడ్ కారణంగానే భద్రత కల్పించలేదన్న వాదనను తోసిపుచ్చారు. జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న వ్యక్తికి కోడ్‌తో సంబంధం లేదని గుర్తు చేశారు. కావాలనే జగన్ భద్రతపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ ఫిర్యాదు చేయడం, బొత్స చేసిన విమర్శలపై ప్రభుత్వం నుంచి రియాక్షన్ వచ్చింది. బొత్స చేసిన ఆరోపణలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఘాటుగా స్పందించారు. జగన్‌కు భద్రత ఏం తగ్గిందని ప్రశ్నించారు. వైసీపీ నేతలు గవర్నర్‌ను కలవడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్‌కు భద్రత తగ్గించలేదని తెలిపారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం తెలీదా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిగా వ్యవస్థల్ని నాశనం చేసి ఎప్పుడూ లేనంత అధ్వాన్నంగా పరిపాలన చేశారని గొట్టిపాటి ఆరోపించారు. చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టిన రోజులు, ఎమ్మెల్యేని దాడికి పంపిన రోజులు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. 7వేల రూపాయల ఎమ్ఎస్పీ ఫిక్స్ చేసిన జగన్‌కు మిర్చి రైతుల వద్దకు వెళ్ళే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రజలు 11సీట్లు ఇచ్చి సంవత్సరమైనా జగన్ బుద్ధి మారలేదని ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పటికైనా బుద్ధిమార్చుకోవాలి సూచించారు. ఇంకా అసత్యాలతో ప్రజల్ని తప్పుదోవపట్టించాలనుకోవటం తగదని హితవు పలికారు.
జగన్ కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ ను కలిశారు..?
— Gottipati Ravi Kumar (@ravi_gottipati) February 20, 2025
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కు ఎలాంటి భద్రత తగ్గించలేదు
ముఖ్యమంత్రి గా పనిచేసిన వాడికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం తెలీదా.?
ముఖ్యమంత్రిగా వ్యవస్థల్ని నాశనం చేసి ఎప్పుడూ లేనంత అధ్వాన్నంగా పరిపాలన… pic.twitter.com/y9gs7eK5RX
Also Read: వైసీపీ అధినేత జగన్‌పై కేసు నమోదు - నిందితులుగా కొడాలి నాని, అంబటి రాంబాబు సహా ఏడుగురు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

