Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టులో పోసాని, ఆర్జీవీకి ఊరట- కేసులపై కీలక ఆదేశాలు
Andhra Pradesh High Court: చంద్రబాబు, పవన్ సహా కూటమి నేతలపై అసత్య ప్రచారం చేసినందుకు పోసాని, ఆర్జీవీపై ఏపీలో చాలా కేసులు నమోదు అయ్యాయి. దీనిపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Andhra Pradesh High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నటుడు పోసాని కృష్ణ మురళికి ఊరట లభించింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ సహా వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ చేసిన అసభ్యకరమైన కామెంట్స్‌తో పోసానిపై కేసులు నమోదు అయ్యాయి. విశాఖ, చిత్తూరు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్‌ల్లో కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఆయన్ని విచారించేందుకు ఆయా స్టేషన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
రెండు జిల్లాల్లో నమోదు అయిన కేసులు కొట్టేయాలని పోసాని కృష్ణ మురళి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన క్వాష్ పిటిషన్లు విచారించిన కోర్టు ప్రస్తుతానికి మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది కోర్టు. అనంతరం విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
Also Read: వివేకా హత్య కేసులో కీలక పరిణామం - భద్రత కల్పించిన సాక్షి మృతి !
ఇలాంటి కేసుల్లో ఆర్జీవీకి కూడా ఊరట లభించింది. అమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే పేరుతో తీసిన సినిమాపై గుంటూరులో ఆర్జీవీపై కేసు నమోదు అయింది. విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై రామ్‌గోపాల్ వర్మ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు కేసుల విచారణపై స్టే విధించింది.
ఆర్జీవీ వేసిన క్వాష్ పిటిషన్లు విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడమేంటని ప్రశ్నించింది.
Also Read: విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?





















