India vs South Africa ODI | రోహిత్, కోహ్లీ రీఎంట్రీ !
టెస్ట్ సిరీస్ ముగియగానే సౌతాఫ్రికాతో టీమ్ ఇండియా వన్డేల సిరీస్ ను మొదలు పెడుతుంది. ఈ సిరీస్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఈ సిరీస్ ద్వారా టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి టీమ్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇండియాలోనే సిరీస్ జరుగుతుండడంతో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే గాయం కారణంగా ఈ సిరీస్ కు శుబ్మన్ గిల్ తోపాటు హార్దిక్ పాండ్య దూరం ఉందనునట్లుగా తెలుస్తుంది. ఆసియా కప్ లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. కాబట్టి టీమ్ లోకి హార్దిక్ ఉండడం కష్టమే. ఇక సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తోలి టెస్ట్ మ్యాచ్ లో శుబ్మన్ గిల్ కూడా గాయపడ్డాడు. మేడ నోపి తగ్గకపోతే మ్యాచులకు దూరమైయే అవకాశం ఉంది. ఒకవేళ శుబ్మన్ గిల్ అందుబాటులో లేకపోతే, రోహిత్ శర్మ తిరిగి పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ కూడా గాయంతో దూరమవడంతో రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. ఈ వన్డే సిరీస్ తో టీమ్ లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.






















