Deekshith Shetty : రష్మిక ఎంగేజ్మెంట్‌పై క్వశ్చన్ - 'ది గర్ల్ ఫ్రెండ్' హీరో దీక్షిత్ రియాక్షన్
Rashmika Mandanna : కో యాక్టర్స్ వ్యక్తిగత విషయాలు తనకు అనవసరమని హీరో దీక్షిత్ శెట్టి అన్నారు. రష్మిక ఎంగేజ్మెంట్‌పై ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన రియాక్ట్ అయ్యారు.

Deekshith Shetty Reaction On Rashmika Love Story : టాలీవుడ్ యంగ్ హీరో దీక్షిత్ శెట్టి రీసెంట్‌గా 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీతో సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండగా... రష్మిక ఎంగేజ్మెంట్‌పై అడిగిన ప్రశ్నకు కొంత అసహనం వ్యక్తం చేశారు. ఇతరుల పర్సనల్ విషయాల గురించి తాను పట్టించుకోనని అన్నారు.
'అది ఆమె పర్సనల్ విషయం'
అది పూర్తిగా ఆమె పర్సనల్ విషయం అని... ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి తాను పట్టించుకోనని అన్నారు దీక్షిత్. 'కో యాక్టర్స్ పర్సనల్ లైఫ్ గురించి నేను అస్సలు పట్టించుకోను. వాళ్ల వ్యక్తిగత విషయాల గురించి ఎక్కడా మాట్లాడకపోవడం ఒకరినొకరు గౌరవించుకునే విధానం. రష్మిక వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఆమె లవ్, ఎంగేజ్మెంట్ గురించి ఎప్పుడూ నేను ఆమెతో చర్చించలేదు. నాకు అలాంటి విషయాల్లో ఆసక్తి ఉండదు. మేము ఎప్పుడూ మూవీస్ గురించే మాట్లాడుకుంటాం.' అని చెప్పారు.
రష్మిక, దీక్షిత్ శెట్టి కాంబోలో వచ్చిన 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే రష్మిక, విజయ్ దేవరకొండకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పటివరకూ దీన్ని అఫీషియల్‌గా ఇద్దరూ కన్ఫర్మ్ చేయలేదు.
Also Read : ఓటీటీలోకే డైరెక్ట్‌గా సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ 'స్టీఫెన్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందా?
రీసెంట్‌గా జరిగిన ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూల్లో ఎంగేజ్మెంట్ వార్తలు నిజమే అనేలా హింట్స్ ఇచ్చారు రష్మిక, విజయ్. ఇద్దరి చేతికి రింగ్స్ వైరల్ అవుతుండగా అవి ఎంగేజ్మెంట్ రింగ్సేనని కామెంట్స్ వచ్చాయి. ఇక వీరిద్దరి పెళ్లి కూడా త్వరలోనే జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వెన్యూను చూసేందుకు రష్మిక ఇటీవలే రాజస్థాన్ ఉదయపూర్ వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం. దక్షిణ భారత, రాజస్థానీ సంప్రదాయాల కలయికతో వీరి పెళ్లి జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎంగేజ్మెంట్, పెళ్లి డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.






















