Stephen Movie OTT : ఓటీటీలోకే డైరెక్ట్‌గా సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ 'స్టీఫెన్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Stephen OTT Platform : మరో తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. లేటెస్ట్ తమిళ మూవీ 'స్టీఫెన్' నేరుగా ఓటీటీలోకే రాబోతోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

Gomathi Shankar's Stephen Movie OTT Release Date Locked : ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ అందులోనూ హారర్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీసెస్‌పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్న క్రమంలో అలాంటి కంటెంట్‌నే ఎక్కువగా ప్రముఖ ఓటీటీలు స్ట్రీమింగ్ చేస్తున్నాయి. తాజాగా మరో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'స్టీఫెన్' ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
'గార్గి' పేం గోమతి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ 'స్టీఫెన్'. ఈ మూవీకి మిథున్ బాలాజీ దర్శకత్వం వహించారు. ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. గోమతి శంకర్‌తో పాటు మైఖేల్ తంగదురై, సమ్రుతి వెంకట్ కీలక పాత్రలు పోషించారు.
View this post on Instagram
Also Read : ఓటీటీలోకి వచ్చేసిన 'బైసన్' మూవీ - చియాన్ విక్రమ్ కొడుకు యాక్షన్ ఎంటర్టైనర్ ఎందులో చూడొచ్చంటే?
స్టోరీ ఏంటంటే?
ఈ మూవీ ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. 'మన చేతికి ఎవరైనా సీరియల్ కిల్లర్ దొరికితే... మనం అడగాల్సింది ఎందుకు అని కాదు... ఎవరు అని?' అనే క్యాప్షన్ ఇవ్వడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. వరుసగా అమ్మాయిల మిస్సింగ్... నేరం చేశానని ఒప్పుకున్న ఓ సీరియల్ కిల్లర్... అతన్ని ఇన్వెస్టిగేట్ చేసే ఓ సైకియాట్రిస్ట్ చుట్టూ ఈ కథ సాగుతుంది. సీరియల్ కిల్లర్ చేతికి బేడీలు సహా చుట్టూ అతని చుట్టూ అమ్మాయిల ఫోటల కింద రక్తం మరకలు ఉన్నట్లుగా కత్తిని చూపించారు. మోసం, మైండ్ గేమ్స్ బ్యాక్ డ్రాప్‌గా ఆద్యంతం థ్రిల్‌ను పంచే విధంగా మూవీ ఉండబోతోందని పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది.






















