Four Labour Codes: కేంద్రం సంచలనం - 29 కార్మిక చట్టాల రద్దు - కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ - ఇవిగో డీటైల్స్
Biggest workforce reforms: భారత చరిత్రలో అతిపెద్ద కార్మిక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. నాలుగు కార్మిక కోడ్‌ల అమల్లోకి తెచ్చారు. 29 చట్టాలను రద్దు చేశారు.

Four Labour Codes implemented in India: భారత ప్రభుత్వం శుక్రవారం నుంచి నాలుగు కార్మిక కోడ్‌లను అమలులోకి తీసుకువచ్చింది. ఇది స్వాతంత్రం అనంతరం అతిపెద్ద కార్మిక సంస్కరణ. 29 పాత కేంద్ర చట్టాలను ఏకీకృతం చేసి, డిజిటల్, గిగ్ ఎకానమీకు అనుగుణంగా మార్చిన ఈ కోడ్‌లు కార్మికుల హక్కులను బలోపేతం చేస్తాయి. 2019-2020 మధ్య పార్లమెంట్‌లో ఆమోదించి కోడ్‌లపై ఆధారపడి, 1930-50లలో రూపొందించిన చట్టాలను భర్తీ చేస్తుంది. ఈ సంస్కరణ ద్వారా కార్మికుల సామాజిక భద్రతా కవరేజ్ 2015లో 19% నుంచి 2025లో 64%కు పెరిగిందని మరింతగా రక్షణ ఇస్తుందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చెబుతోంది.
ఈ కోడ్‌లు కార్మికుల జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత, పరిశ్రమా సంబంధాలు, భద్రతా , పని పరిస్థితులను కవర్ చేస్తాయి
1. వేజెస్ కోడ్ : మినిమమ్ వేజెస్‌కు చట్టపరమైన హక్కు, టైమ్లీ వేజ్ పేమెంట్, గిగ్ & ప్లాట్‌ఫాం వర్కర్లకు PF, ESIC, ఇన్సూరెన్స్ వంటి యూనివర్సల్ సామాజిక భద్రత. మహిళలకు నైట్ షిఫ్ట్‌లు అనుమతి , ట్రాన్స్‌జెండర్‌లకు జెండర్-న్యూట్రల్ నిబంధనలు.
2. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ : ఫాక్టరీల పరిధిని పెంచి చిన్న వ్యాపారాలకు సులభత, ఫిక్స్‌డ్-టర్మ్, గిగ్, కాంట్రాక్ట్ కార్మికులకు రక్షణ. ఇద్దరు సభ్యుల ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌ల ద్వారా వేగవంతమైన వివాద పరిష్కారం.
3. సోషల్ సెక్యూరిటీ కోడ్ : పాన్-ఇండియా ESIC కవరేజ్, 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఫ్రీ యాన్యువల్ హెల్త్ చెకప్‌లు. మైగ్రెంట్ & ఇన్ఫార్మల్ లేబర్‌కు బెనిఫిట్స్ పోర్టబిలిటీ, MSME, బీడీ/ప్లాంటేషన్/టెక్స్‌టైల్/డాక్/ఆడియో-విజువల్/డిజిటల్ మీడియా/మైన్/హాజార్డస్/IT/ITES/ఎక్స్‌పోర్ట్ సెక్టర్‌లకు ప్రత్యేక రక్షణలు.
4. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ (OSHWC) కోడ్ : భద్రతా కమిటీలు (500+ వర్కర్ల యూనిట్లలో), నేషనల్ OSH బోర్డ్ ద్వారా స్టాండర్డైజ్డ్ సేఫ్టీ నార్మ్స్. ఇన్‌స్పెక్టర్-కమ్-ఫెసిలిటేటర్ సిస్టమ్ ద్వారా గైడెన్స్-ఫోకస్డ్ అప్రోచ్.
ఈ కోడ్‌లు కార్మికులకు మ్యాండేటరీ అపాయింట్‌మెంట్ లెటర్స్, నేషనల్ ఫ్లోర్ వేజ్, మహిళలు/యూత్/కాంట్రాక్ట్ వర్కర్లకు ప్రత్యేక హక్కులు అందిస్తాయి.
2019-2020 మధ్య పార్లమెంట్‌లో ఆమోదించిన ఈ కోడ్‌లు, సంప్రదింపుల తర్వాత నవంబర్ 21, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. పాత చట్టాలలోని రూల్స్, నోటిఫికేషన్‌లు స్టేక్‌హోల్డర్‌ల సంప్రదింపుల తర్వాత మార్చుతారు. ప్రభుత్వం "హిస్టారిక్ డెసిషన్"గా పేర్కొంటూ, "ప్రొటెక్టెడ్, ఫ్యూచర్-రెడీ వర్క్‌ఫోర్స్ మరియు రెసిలియెంట్ ఇండస్ట్రీలు" సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్కరణలు 'ఆత్మనిర్భర్ భారత్'కు ఉద్యోగాల సృష్టికి దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ సంస్కరణలు పాత చట్టాలలోని కాలం చెల్లిపోయిన రూల్స్ ను తొలగించి, డిజిటల్ ఎకానమీకు సరిపోయేలా చేశాయి. కార్మికులకు యూనివర్సల్ కవరేజ్, వ్యాపారాలకు 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' పెరుగుదల – ఇది FDI, ఉద్యోగాలు పెంచుతుంది. గిగ్ వర్కర్ల కు మొదటిసారి భద్రతలు అందడం పెద్ద మార్పు. అయితే అమలు సమయంలో పాత రూల్స్ కొనసాగడం కన్ఫ్యూజన్‌కు దారితీయవచ్చు. రాష్ట్రాలు తమ చట్టాలను కేంద్రచట్టాలకుఅనుగుణంగా మార్చాల్సి ఉంది, ఇది ఆలస్యానికి దారితీస్తుంది.
PM Narendra Modi tweets, "Today, our Government has given effect to the Four Labour Codes. It is one of the most comprehensive and progressive labour-oriented reforms since Independence. It greatly empowers our workers. It also significantly simplifies compliance and promotes… pic.twitter.com/wveeLf0wAz
— ANI (@ANI) November 21, 2025
మోదీ ప్రభుత్వం 2020 నుంచి ఈ సంస్కరణలను అమలు చేయడానికిప్రయ్తనిస్తోంది. కానీ కోవిడ్, రాష్ట్రాల అభ్యంతరాల కారణంగా ఆలస్యం అవుతున్నాయి. ప్రభుత్వం "ఈ కోడ్‌లు భారతీయ కార్మికులకు గ్లోబల్ స్టాండర్డ్స్ అందిస్తాయి" అని చెబుతోంది.





















