డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా చెబితే అది పెద్ద మోసం అని తెలుసుకోవాలి. ఎందుకంటే మన చట్టాల్లో డిజిటల్ అరెస్ట్ లేదు.

Published by: Raja Sekhar Allu

మీ పేరు మీద మాదకద్రవ్య స్మగ్లింగ్, మనీ లాండరింగ్ వంటి తీవ్ర నేరాల కేసు ఉందని భయపెడతారు. మన భయమే వారికి ఆదాయం.

Published by: Raja Sekhar Allu

. కేసు 'సెటిల్' చేయడానికి లేదా 'పర్సనల్ బాండ్' ఇవ్వమని డబ్బు డిమాండ్ చేస్తారు. UPI, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా డబ్బు వసూలు చేస్తారు

Published by: Raja Sekhar Allu

ఫేక్ అరెస్ట్ వారెంట్లు, కోర్టు నోటీసులు, అధికారిక లెటర్‌లు ఇమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపుతారు.

Published by: Raja Sekhar Allu

2024లో మాత్రమే 2 వేల కోట్ల రూపాయలు మోసపోయారు. ఇందులో చదువుకున్నవారూ ఉన్నారు.

Published by: Raja Sekhar Allu

ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్'లో ఈ మోసాలపై హెచ్చరించారు. అధికారులు వీడియో కాల్‌ల ద్వారా అరెస్ట్ చేయరు అని స్పష్టం చేశారు.

Published by: Raja Sekhar Allu

సుప్రీంకోర్టు ఈ మోసాలపై తీవ్రంగా స్పందించి, అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్త దర్యాప్తు అవసరమని చెప్పింది

Published by: Raja Sekhar Allu

అధికారులు మొదట ఫోన్‌లో మాట్లాడి, తర్వాత వీడియో కాల్‌లో 'అరెస్ట్' చేయరు. డబ్బు డిమాండ్ చేస్తే, అది మోసమే.

Published by: Raja Sekhar Allu

అపరిచిత కాల్స్‌కు స్పందించకండి. సందేహం ఉంటే, స్థానిక పోలీస్ స్టేషన్‌కు కాల్ చేయండి.

Published by: Raja Sekhar Allu

మోసం జరిగితే, వెంటనే 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్)కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో రిపోర్ట్ చేయండి.

Published by: Raja Sekhar Allu