Jagan letter to Chandrababu: కృష్ణా జలాలపై హక్కులు కాపాడండి - చంద్రబాబుకు జగన్ 9 పేజీల లేఖ
Jagan: కృష్ణా జలాలపై హక్కులు కాపాడాలని చంద్రబాబుకు జగన్ 9పేజీల లేఖ రాశారు. తెలంగాణ డిమాండ్ కు అంగీకరిస్తే ఏపీకి అన్యాయం జరుగుతుందన్నారు.

Jagan writes 9 page letter to Chandrababu Naidu : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి 9 పేజీల బహిరంగ లేఖ రాశారు. కృష్ణా నది జల వాటాల పునఃపంపిణీపై కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ -2 (KWDT-II) ముందు రాబోయే విచారణల్లో ఆంధ్రప్రదేశ్ హక్కులను కాపాడుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కృష్ణా జలాల వివాదంపై భారీ లేఖ రాసిన జగన్
తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిలో 63 TMC డిపెండబుల్ నీటిని తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌ను ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరుగుతుందని జగన్ హెచ్చరించారు. ఉమ్మడి ఏపీకి నికరంగా 512 TMC కేటాయించింది. ఇప్పుడు ఒక్క TMC కూడా తగ్గితే దానికి టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. అల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే కర్ణాటకకు అనుమతి దక్కిందని జగన్ ఆరోపించారు. 1996లో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉండగా, అల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పనులు మొదలయ్యాయి. అప్పటి వ్యతిరేకత, రైతు ఉద్యమాలను పట్టించుకోలేదని, దాంతో బృజేష్ కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటకకు అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. 
ఏపీ హక్కులు కాపాడాలని డిమాండ్
2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కృష్ణా జలాల్లో ఏపీ హక్కులను తెలంగాణకు వదులుకున్నట్టు వ్యవహరించిందని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబే సీఎం అయిన సమయంలో ఏపీ కీలక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రాయలసీమ ప్రాజెక్టుల పట్ల టీడీపీ ఎప్పట్నుంచో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాపాడేందుకు పూర్తి నిబద్ధతతో పోరాడాలని జగన్ కోరారు. క్విడ్-2 ట్రిబ్యునల్ ముందు ఏపీ తుది వాదనలు బలంగా సమర్పించి, పునఃకేటాయింపును అడ్డుకోవాలన్నారు.
ఎక్కువ వాటా కోరుతున్న తెలంగాణ - గత ఒప్పందం తాత్కాలికమేనని వాదన
తెలంగాణ ప్రధాన డిమాండ్: 811 TMCలో 70 శాతం వాటా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 811 TMC వాటాల్లో తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో 299 TMCలు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌కు 512 TMC లు కేటాయించారు. ఇది క్యాచ్‌మెంట్ ఏరియా (68%), పాపులేషన్ (41%) మరియు ఇతర పారామీటర్ల ఆధారంగా ఉంది. తెలంగాణలో కృష్ణా బేసిన్‌లో కేవలం 15% కల్వబుల్ ల్యాండ్‌కు మాత్రమే అసూర్డ్ ఇరిగేషన్ లభిస్తోంది, ఆంధ్రప్రదేశ్‌లో 95% శాతానికి లభిస్తోందని తెలంగాణ వాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్ 323 TMCను బేసిన్ బయట పోలవరం, పట్టీసీమ కు డైవర్ట్ చేస్తోందని.. తె . ఇది అన్యాయమని, KWDT-I సూత్రాల ప్రకారం బేసిన్ లోపల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని వాదిస్తోంది. ఏపీ 66:34 రేషియోను మెయింటైన్ చేయాలని, 50:50 అమలు అయితే 105 TMC కోల్పోతామని వ్యతిరేకిస్తోంది.





















