Rajamouli : రాజమౌళిపై దేవుడికి లేని కోపం మీకెందుకు? - హనుమాన్ కామెంట్స్ కాంట్రవర్సీ... RGV సెన్సేషనల్ కామెంట్స్
Ram Gopal Varma : దర్శక ధీరుడు రాజమౌళికి సెన్సేషనల్ డైరెక్టర్ RGV సపోర్ట్‌గా నిలిచారు. విమర్శించే వారిపై ఫైర్ అవుతూనే 'X'లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

RGV Reaction On Rajamouli Hanuman Comments Issue : 'వారణాసి' టైటిల్ గ్లింప్స్ ఈవెంట్‌లో దర్శకధీరుడు రాజమౌళి హనుమాన్‌పై చేసిన కామెంట్స్ వివాదం అయిన సంగతి తెలిసిందే. రాజమౌళి క్షమాపణ చెప్పాల్సిందేనని లేకుంటే ఆయన సినిమాలు ఆపేస్తామంటూ VHP నేతలు వార్నింగ్ ఇచ్చారు. అలాగే, పలువురు బీజేపీ నేతలు సైతం జక్కన్న కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, రాజమౌళికి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సపోర్ట్‌గా నిలిచారు.
దేవుడికి లేని కోపం మీకెందుకు?
జక్కన్నకు సపోర్ట్ చేస్తూ తన 'X'లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. రాజమౌళిని విమర్శిస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'రాజమౌళిపై విషం కక్కుతోన్న సో కాల్డ్ ధర్మ పరిరక్షకులు భారతదేశంలో నాస్తికునిగా ఉండడం నేరం కాదని తెలుసుకోవాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 దేవుడిని నమ్మని హక్కును రక్షిస్తుంది. మీకు దేవుడిని నమ్ముతున్నాం అని చెప్పే హక్కు ఎంత ఉందో... రాజమౌళికి కూడా దేవుడిని నమ్మను అని చెప్పే హక్కు అంతే ఉంది.
మరి రాజమౌళి సినిమాల్లో దేవుడిని ఎందుకు చూపిస్తున్నాడు? అనేది మూర్ఖపు వాదన. ఒకవేళ గ్యాంగ్ స్టర్ సినిమా తీయాలంటే గ్యాంగ్ స్టర్‌గా మారాలా? హారర్ సినిమా కోసం దెయ్యంగా మారాలా?. రాజమౌళి దేవుడిని నమ్మకపోయినా దేవుడిని నమ్మేవారు జీవితంలో చూడని విజయాన్ని, సంపదను చూశారు. దీన్ని బట్టి దేవుడు భక్తుల కంటే నాస్తికులకే ఎక్కువ ప్రేమిస్తుండాలి. దేవునికి రాజమౌళితో ఎలాంటి సమస్య లేదు. మరి మీకెందుకు ఇబ్బంది?.' అంటూ సెటైరికల్‌గా ప్రశ్నించారు.
అసలు సమస్య ఏంటంటే?
ఇక్కడ అసలు సమస్య రాజమౌళి నాస్తికత్వం కాదని... అతని దేవుడిని నమ్మకుండానే విజయం సాధించడమేనని అన్నారు ఆర్జీవీ. 'రాజమౌళి సక్సెస్ దేవుడిని పిచ్చిగా ప్రార్థించినా విజయం సాధించలేని వారిని భయపెడుతోంది. కాబట్టి నమ్మే వారు దేవుడిని సమర్థించడం మానేయాలి. రాజమౌళి నాస్తికుడు కావడం దేవుడిని తగ్గించదు. ఎవరైనా నమ్మకం కోల్పోయిన వెంటనే విశ్వాసం కూలిపోతుందని భావించే వారి ఇన్ సెక్యూరిటీ మాత్రమే పెరుగుతుంది.' అని అన్నారు.
'ఫైనల్‌గా దేవుడు బాగున్నాడు. రాజమౌళి బాగున్నాడు. వారిద్దరినీ అర్థం చేసుకోలేని వ్యక్తులు మాత్రమే బాధ పడుతున్నారు. కాబట్టి 'వారణాసి' ద్వారా రాజమౌళికి ఇప్పటికే నిండిన బ్యాంక్ బ్యాలెన్స్‌కు భారీ అదృష్టాన్ని జోడిస్తాడు. ఓడిపోయిన వారు అసూయతో తమ హృదయాలను అలాగే ఉంచి ఏడ్చవచ్చు. నేను చెప్పేదేంటంటే ఇది దేవుడిపై నమ్మకంగా ముసుగు వేసుకున్న అసూయ. జై హనుమాన్' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : ఓటీటీలోకే డైరెక్ట్‌గా సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ 'స్టీఫెన్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
రాజమౌళి ఏమన్నారంటే?
'వారణాసి' టైటిల్ గ్లింప్స్ ఈవెంట్‌లో వీడియో ప్లే చేస్తుండగా టెక్నికల్ గ్లిచ్‌తో ఆగిపోయింది. ఆ తర్వాత ప్రసంగించిన రాజమౌళి తనకు దేవుడంటే నమ్మకం లేదని అన్నారు. 'హనుమాన్ వెనకుండి నడిపిస్తున్నారని నాన్న అన్నారు. ఇలా అయిన వెంటనే నాకు కోపం వచ్చింది. ఇదేనా నడిపించేది అని.' అంటూ కామెంట్ చేయడం వివాదమైంది. ఆయనపై VHP నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రీయ వానర సైన్యం రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.





















