అన్వేషించండి

YS Vivka Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం - భద్రత కల్పించిన సాక్షి మృతి !

Ranganna: వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్న చనిపోయారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Viveka murder case:  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ప్రధాన సాక్షి చనిపోయారు. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్నఅనారోగ్యంతో బాధపడుతూ కడప రిమ్స్ ఆస్పత్రిలో చనిపోయారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు రంగన్న ఇంటి వాచ్ మెన్ గా ఉన్నారు.  ఈ కేసులో పలుమార్లు రంగన్నను సీబీఐ అధికారులు ప్రశ్నించి స్టేట్ మెంట్ నమోదు చేశారు. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్నను మొదట   ఎవరూ పట్టించుకోలేదు కానీ..సీబీఐకి ఆయన ఇచ్చిన వాంగ్మూలం మాత్రం సంచలనం సృష్టించింది. ఎర్రగంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి కలిసి వివేకను హత్య చేశారని 164 స్టేట్‌మెంట్‌‌లో రంగన్న చెప్పారు. ఏ 1 నిందిుతుడు దస్తగిరి అప్రూవర్‌గా మారాడు.  
 
ఇదే కేసులో నిందితుడుగా ఉన్న కల్లూరు గంగాధర రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శ్రీనివాసరెడ్డి మరో అనుమానితుు కూడా అనుమానాస్పదంగా  చనిపోయారు.  మృతదేహానికి కుట్లు వేసిన..వేయించిన వైద్యులు ఈసీ గంగిరెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా చనిపోయారు. ఇప్పుడు రంగన్న కూడా చనిపోవడంతో సాక్షులంతా వరుసగా చనిపోతున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. వివేకా హత్య కేసులో  ప్రత్యక్ష సాక్షి కావడం వల్ల ఆయనకు 1+1 భద్రత కల్పించారు. కీలక సాక్షులంతా చనిపోతున్నా..కేసుల్లో మాత్రం అడుగు ముందుకు పడటం లేదని ఆరు నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలని వైఎస్ సునీత ఇటీవల తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. 

సునీత దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.  ఈ కేసు సీబీఐ కోర్టుకు బదిలీ అయి రెండేళ్లయినా విచారణ ప్రారంభంకాలేదని . అందువల్ల 6 నెలల్లో విచారణ పూర్తయ్యేలా ఆదేశాలివ్వాలంటూ సునీతారెడ్డి పిటిషన్​లో కోరారు. ఈ కేసు విచారణ జరగకుండా నిందితులు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.గౌతం వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఇంకా కోర్టు నుంచి కాగితాలు తీసుకునే దశలోనే ఉన్నారని సునీత వాదిస్తున్నారు. దాదాపు 13 లక్షల ఫైళ్లు ఉండగా అందులో 13,000లు కూడా తెరవలేదన్నారు. ఇంత ఆలస్యంగా ఉంటే కేసు విచారణ ఏల్లు పడుతుందన్నారు.    ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధుల కేసులపై ప్రత్యేక విచారణ చేపట్టేలా చూడాలంటూ సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది  ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం ప్రజాప్రతినిధుల కేసుల పురోగతిని పర్యవేక్షిస్తోందని  ఈ పిటిషన్‌ కూడా ప్రత్యేక ధర్మాసనం ముందుంచాలని రిజిస్త్రీని  న్యాయమూర్తి ఆదేశించారు. త్వరలో ఈ పిటిషన్ విచారణకు రానుంది. 

2019 ఎన్నికలకు ముందు పులివెందులలోని తన నివాసంలోనే వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మొదట ఆయనకు గుండెపోటు వచ్చిందని... రక్తపు వాంతులు చేసుకున్నారని ప్రచారం చేశారు. అయితే ఆయనను చాలా దారుణంగా నరికి చంపారని ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దాంతో తర్వాత హత్యకేసుగా మారింది. ఈ వ్యవహారంలో  ఇప్పటికీ విచారణ పూర్తి కాకపోవడం .. నిందితులు ఇంకా ధైర్యంగా బయట తిరుగుతూండటం రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది.                

టాప్ హెడ్ లైన్స్

AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget