Tamilsai Arrest: తమిళనాడులో హిందీకి సపోర్టుగా తమిళిశై ఉద్యమం - అరెస్ట్ చేసిన ప్రభుత్వం
Tamil Issue: హిందీ భాషకు మద్దతుగా ఆందోళన చేసిన తమిళిసైను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. త్రిభాషా విద్యా విధానానికి అనుకూలంగా ఆమె సంతకాల సేకరణ చేపట్టారు.

Chennai Tamai Hinid Politics : తమిళనాడులో హిందీభ భాషా వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంటోంది. త్రిభాషా విధానాన్ని తమిళనాడు అధికార పార్టీ డీఎంకే తీవ్రంగా తప్పు పడుతోంది. అయితే బీజేపీ మాత్రం సమర్థిస్తోంది. త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ చేపట్టింది. కోటి మంది సంతకాలు సేకరించి రాష్ట్రపతికి నివేదించాలని నిర్ణయించరు. ఈ క్రమంలో చెన్నై ఎంజీ ఆర్ నగర్ లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ గవర్నర్ తమిళిసై కూడా ఉన్నారు.
తమిళనాడులో చిచ్చు పెట్టిన త్రిభాషా విద్యా విధానం
ఇటీవల కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని అమల్లోకి తెవాలని నిర్ణయించింది. అందులో ప్రాంతయ భాష, ఇంగ్లిష్ తో పాటు హిందీ కూడా ఓ భాషగా ఉంటుంది. అయితే హిందీని బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడులో వ్యతిరేకత ప్రారంభమయింది. ఇటీవల రైల్వేస్టేషన్లు వంటి చోట్ల కూడా హిందీ పదాలు కనిపించకుండా నల్లరంగు పూయడం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాల్లో మూడు భాషలు బోధించాలన్న నియమాన్ని అమలుచేయకపోతే సమగ్ర శిక్షా అభియాన్ కింద నిదులు ఇవ్వబోమని కేంద్రం చెబుతోంది. కానీ తాము హిందీని నేర్పించే ప్రశ్నే లేదని తమిళనాడు ప్రభుత్వం తేల్చి చెబుతోంది.
1960ల నుంచి హిందీ వ్యతిరేక ఉద్యమాలు
తమిళనాడులో హిందీ వ్యతిరేకత ఉద్యమం ఈ నాటిది కాదు. కేంద్రం 1968లో మొదటిసారిగా త్రిభాషా సూత్రంతో నూతన విద్యావిధానాన్ని తెచ్చింది. ఆ ఏడాదే పార్లమెంట్ ఉభయసభలు అధికార భాషా తీర్మానాన్ని ఆమోదించాయి. ఆ రెండింటి ప్రకారం హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ర్టాల్లో హిందీ తప్పనిసరిగా బోధించాలన్న రూల్ వచ్చింది. అయితే అన్ని రాష్ట్రాల్లో సైలెంట్ గా ఉన్నా తమిళనాడులో మాత్రం హిందీ వ్యతిరేకత ఉద్యమం ప్రారంభమయింది. ఇప్పటికీ ద్విభాషా విధానమే అమలు చేస్తున్నారు. 1980ల మధ్యలో కూడా భీకర స్థాయిలో హిందీ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి.
హిందీని నేర్పకపోతే నిధులు ఆపేస్తామన్న కేంద్రం - తమిళనాడులో మరింత రచ్చ
2020లో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే అందులో హిందీ తప్పనిసరి అనకుండా మూడు భాషల్లో రెండు స్వదేశీ భాషలైతే చాలునని సడలింపు ఇచ్చింది. ఇంగ్లిష్ స్వదేశీ భాష కాదు. కానీ ఇప్పుడు అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఆ భాష నేర్చుకోవడం తప్పనిసరి. హిందీని, సంస్కృతాన్ని రుద్దేందుకే కేంద్రం త్రిభాషా విధానం తెచ్చిందని స్టాలిన్ ారోపిస్తున్నారు. ఉత్తరాదిన దక్షిణాది భాష ఏదైనా బోధిస్తున్నారా? అని తమిళ సీఎం స్టాలిన్ తాజాగా సవాల్ విసిరారు. అయితే తమిళనాడు బీజేపీ నేతలు మాత్రం త్రిభాషా విధానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. హిందీ నేర్చుకుంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

