AP Speaker Ayyannapathrudu on YS Jagan Letter | స్పీకర్ ను కించపరిచేలా జగన్ లేఖలున్నాయన్న అయ్యన్న | ABP Desam
స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో రూలింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ రాసిన లేఖపై మాట్లాడిన స్పీకర్ అయ్యన్న...తన లేఖలో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంటూ జగన్ అవాకులు చెవాకులు పేలారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఈ తరహా వ్యాఖ్యలతో లేఖలు రాయటం అంటే అది సభా ధిక్కరణకు కిందకే వస్తుందన్న అయ్యపాత్రుడు..జగన్ ప్రతిపక్ష కావటానికి ప్రజలు అనుమతి లేదన్నారు. ప్రజాస్వామ్యం లో ప్రజలే దేవుళ్లన్న అయ్యన్న...అసెంబ్లీ దేవాలయం అన్నారు. స్పీకర్ పూజారి పాత్రను పోషిస్తాడని..దేవుళ్ల అనుమతి లేకుండా ఇక్కడ ఎవరికీ ఏ అధికారం రాదన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈమేరకు స్పీకర్ సందేశం తర్వాత...మంత్రి నారా లోకేశ్ కూడా స్పందించారు.
మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ " చట్టసభలు చూస్తూ పెరిగినవాడ్ని, చిన్నవయసులో చట్టసభలను చూశాను, అప్పట్లో వ్యక్తిగత దూషణలు ఉండేవి కావు, ప్రజలకు ఏమి కావాలో దానిపైనే చర్చలు జరిగేవని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసిపికి ప్రతిపక్ష హోదా అంశంలో సాక్షి తప్పుడు రాతలపై మంత్రి లోకేష్ స్పందిస్తూ... చట్టసభల్లో ఇది నాకు రెండో అవకాశం, తొలిసారి శాసనసభకు వచ్చా. ఇటీవల ప్రతిపక్ష సభ్యులు బాధ్యత చేయకుండా గవర్నర్ స్పీచ్ ను డిస్ట్రబ్ చేసి వెళ్లారు. గతంలో మేం నిరసన తెలియజేసినపుడు బెంచిలవద్దే ఉండి ధర్నా చేశాం, పోడియం వద్దకు రాలేదు. మేం ఎప్పుడూ లక్ష్మణరేఖ దాటలేదు. నేను అసెంబ్లీలో కొత్త మెంబర్ ని. పార్లమెంటులోని 121సి నిబంధన ప్రకారం ప్రతిపక్ష హోదాకు టోటల్ నెం.లో 1/10 ఉండాలని స్పష్టంగా ఉంది. అసెంబ్లీ కండీషన్స్ ఫర్ రికగ్నిషన్ లో కూడా ఈ విషయం పొందుపర్చబడి ఉంది. జగన్మోహన్ రెడ్డి 13, జూన్, 2019న అసెంబ్లీలో మాట్లాడుతూ... చంద్రబాబుగారికి 23మంది సభ్యులు ఉన్నారు, 5గుర్ని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష స్టేటస్ కూడా ఉండదు అని సభ సాక్షిగా వ్యాఖ్యానించారు. స్పీకర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం హౌస్ పరువు తగ్గిస్తుంది. సాక్షి పత్రికలో తప్పుడు రాతలు బాధాకరం. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాప్రతినిధులుగా ప్రజలు తరపున పోరాడాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చాం. ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదు. చట్టాన్ని ఉల్లంఘించడం, దానిని హౌస్ పైన రుద్దడం బాధాకారం. ఎవరు అధికారంలో ఉన్నా ఇది కరెక్టు కాదు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి లోకేష్ చెప్పారు"



















