BRS Target Chandrababu: తెలంగాణలో చంద్రబాబు రాజకీయం - కేసీఆర్ పాత ఆయుధం బయటకు తీశారా ?
Telangana Politics: తెలంగాణలోకి మరో రూపంలో చంద్రబాబు వస్తున్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. చంద్రబాబును బూచిగా చూపించే రాజకీయాలకు కేసీఆర్ తెర తీస్తున్నారని భావిస్తున్నారు.

KCR On Chandrababu: భారత రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ చంద్రబాబు ప్రస్తావన తీసుకు వచ్చారు. చంద్రబాబు ఎన్డీఏ రూపంలో మళ్లీ తెలంగాణలోకి వస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోలేకపోతున్నామని ఇక చంద్రబాబు తెలంగాణలోకి వస్తే ఇక తెలంగాణను కాపాడుకోవడం కష్టం అన్నట్లుగా ఆయన మాట్లాడారు. సహజంగా కేసీఆర్ టోన్ చంద్రబాబు విషయంలో అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా తెలంగాణ రాజకీయాలకు దూరమయ్యారు. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడ్ని కూడా నియమించలేదు. పైగా ఎన్డీఏలో ఉన్నా అది ఏపీ వరకే. మరి కేసీఆర్ ఎందుకు చంద్రబాబు ప్రస్తావన తీసుకు వచ్చారు..?
తెలంగాణ ఏన్డీఏలో లేని చంద్రబాబు
తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ వర్కవుట్ కాలేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. టీడీపీతో అసలు పెట్టుకోలేదు. ఏపీలో ఎన్డీఏ కూటమిగా పని చేసినా.. తెలంగాణలో అసలు అలాంటి ఆలోచన రానివ్వలేదు. ఇప్పటికీ కూడా తెలంగాణలో బీజేపీ.. టీడీపీని కలుపుకునే ప్రయత్నం చేయడం లేదు. అసుల ఆ పార్టీ ఉనికి తెలంగాణలో గుర్తించడం లేదు. మరి చంద్రబాబు ఎన్డీఏ రూపంలో తెలంగాణలోకి వస్తున్నారని కేసీఆర్ ఎందుకు అనుకున్నారన్నది రాజకీయ వర్గాలకు అంతు బట్టని ప్రశ్నగా మారింది.
టీడీపీని యాక్టివ్ చేసే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారని ప్రచారం
ఎన్డీఏతో సంబంధం లేకుండా చంద్రబాబు తన పార్టీని యాక్టివేట్ చేసే ఆలోచనలో ఉన్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ ఈ విషయంలో మరో వ్యూహకర్త రాబిన్ సింగ్ తో కలిసి స్ట్రాటజీ మీద వర్కవుట్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ విషయంలోనూ ఇంకా ఎలాంటి ముందుడుగు పడలేదు. కనీసం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడ్ని కూడా నియమించలేదు. బీఆర్ఎస్ లో అలజడి రేగినప్పుడు ఎవరైనా నేతలు టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగగుతుంది. తర్వాత సైలెంట్ అవుతారు. తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరుతానని ప్రకటించారు. ఇంకా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
చంద్రబాబును బూచిగా చూపించే ప్లానేనా ?
కేసీఆర్ చంద్రబాబు ప్రస్తావన తీసుకు రావడం వ్యూహాత్మకమేనని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్డీఏ రూపంలో అయినా.. టీడీపీ సొంతంగా అయినా తెలంగాణలో కార్యకలాపాలు యాక్టివ్ చేస్తుందన్న సమాచారం ఉండటంతోనే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుల్లో చంద్రబాబు అంటే వ్యతిరేకత ఉంటుందని.. చంద్రబాబు మళ్లీ తెలంగాణకు వస్తున్నారంటే.. వారంతా మళ్లీ యాక్టివ్ అవుతానర్న బావనతోనే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. కేసీఆర్ రెండో సారి గెలిచినప్పుడు పూర్తి స్థాయిలో చంద్రబాబు వ్యతిరేక ప్రచారం చేశారు. అప్పట్లో చంద్రబాబు మహా కూటమి పెట్టి .. యాక్టివ్ గా తెలంగాణలో ప్రచారం చేశారు. కానీ తర్వాత పూర్తిగా తెలంగాణకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు.
Also Read: పవన్ హిమాలయాలకు వెళ్తున్నారా - మోడీ ప్రశ్నకు పవన్ జవాబు ఏంటంటే ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

